Advertisement
Google Ads BL

ఈ కమెడియన్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు!


స్టార్‌ హీరోలు మల్టీస్టారర్స్‌ చేస్తే ప్రేక్షకులకు అదో కిక్‌. కానీ టాలీవుడ్‌లో నిజమైన మల్టీస్టారర్స్‌ రావడం లేదు. ఒకే జనరేషన్‌కి చెందిన అంటే పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి వారు కలిసి నటించడం లేదు. మహా అయితే సీనియర్‌ స్టార్స్‌ అయిన వెంకటేష్‌, నాగార్జునలు మహేష్‌బాబు, రామ్‌, కార్తి వంటివారితో నటిస్తున్నారు. ఇక యంగ్‌ హీరోలు కలిసి 'శమంతకమణి' వంటి చిత్రాలు చేసినా వాటిని కూడా మల్టీ హీరోల చిత్రాలు అనకుండా మల్టీస్టారర్స్‌ అని పిలుస్తూ మనం సంబరపడిపోతున్నాం. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఏకంగా ఓ నలుగురు కామెడీ హీరోలు కలిసి ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. బ్రహ్మానందం ఫేడవుట్‌ అయిన తర్వాత తన పేరడీలతో హాస్యం పండిస్తూ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో యంగ్‌ హీరో నవీన్‌చంద్రను కూడా డామినేట్‌ చేసి క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకున్న 30 ఇయర్స్‌ పృథ్వీ ఒకరైతే..... 'మెంటల్‌కృష్ణ'తో పాటు 'నాయక్‌, టెంపర్‌' వంటి చిత్రాలలో నటించిన మోస్ట్‌ బిజీ కామెడీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన పోసాని కృష్ణ మురళి కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. 

ఇక ఇంతకాలం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల చిత్రాలను కూడా కాదని, హీరో పాత్రలకే పరిమితమైన కమెడియన్‌ సునీల్‌ ఒకేసారి మరలా కమెడియన్‌గా మారకుండా ఈ చిత్రంలోని నలుగురు కామెడీ స్టార్స్‌లో ఒకడిగా నటించి, చిన్నగా మరలా కమెడియన్‌ వేషాలకు సిద్దమవుతున్నాడు. వీరితో పాటు ఈ చిత్రంలో మరో యంగ్‌ కమెడియన్‌ కూడా నటిస్తాడని సమాచారం. 

మొత్తానికి ఇప్పుడు స్టార్‌ కమెడియన్ల మల్టీస్టారర్‌ మూవీలకు బీజం పడిందని చెప్పాలి. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్‌ సమాచారం రానుంది. అది వస్తే గానీ అసలు ఈ చిత్రం విషయాలు పక్కాగా తెలియవు. 

Comedians in Different Thinking:

Tollywood Comedians Plans to do Multi Comedians Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs