Advertisement
Google Ads BL

'జై లవ కుశ'- బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్!


ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జై లవ కుశ చిత్ర పాటలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా? ఎప్పుడెప్పుడు విందామా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక 'జై లవ కుశ' ఆడియో వేడుకలో తమ అభిమాన హీరో స్పీచ్ వినడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్న వేళ 'జై లవ కుశ' ఆడియో వేడుకని సెప్టెంబర్ 3 న రద్దు చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కతున్న 'జై లవ కుశ' ఆడియోని వచ్చే నెల 3 న భారీ లెవల్లో నిర్వహించాలని చిత్ర టీమ్ ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఆ రోజున ఆడియో నిర్వహించడానికి గణేష్ నిమజ్జనం, భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టే ఈ వేడుకని రద్దు చేసినట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

Advertisement
CJ Advs

గణేష్ నిమజ్జనంతో హైదరాబాద్ అంతా హడావిడిగా ఉండడం ఆడియో వేడుక దగ్గర ఫ్యాన్స్ హంగామాతో సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండడంతోనే ఈ వేడుకని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 3 న 'జై లవ కుశ' పాటలని నేరుగా మార్కెట్ లోకి వదిలేస్తామని కూడా చెప్పింది. అలాగే ఫ్యాన్స్ ఎవరు డిస్పాయింట్ కావొద్దని 'జై లవ కుశ' విడుదల సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 10 న గ్రాండ్ లెవల్లో నిర్వహించబోతున్నట్లు... అదే రోజున 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

No Audio Function to Jai Lava Kusa:

Jai Lava Kusa Pre Release Event will be held on September 10th. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs