Advertisement
Google Ads BL

పీకే బర్త్ డే స్పెషల్ : ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్..!!


పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అయిపోండంటున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గురించిన ఒక న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం ఫస్ట్ లుక్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు స్వీట్ న్యూస్ అంటూ సెప్టెంబర్ 2 న పవన్ చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారని తాజాగా న్యూస్ వినిపిస్తోంది. అయితే పవన్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేస్తారో లేకుంటే డైరెక్ట్ గా టీజర్ విడుదల చేస్తారో మొత్తానికి పవన్ ఫాన్స్ కి మాత్రం అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందనేది మాత్రం ఈసారి పక్కా అంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే వారం ముందు ఇలానే ప్రీ లుక్ విడుదల చేసి మరీ పవన్ ఫస్ట్ లుక్ పవన్ బర్త్ డే రోజున పక్కా అంటూనే మళ్ళీ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా పవన్ తన తాజా చిత్రం సర్ప్రైజ్ తో రెడీ అవుతుందనే న్యూస్ మాత్రం ఖచ్చితం అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈసారి అంతలా పవన్ ఫస్ట్ లుక్ వస్తుందని నొక్కి వక్కాణించడానికి కారణం మాత్రం... ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ ఒక టైటిల్ ని రిజిస్టర్ చేయించడమే అంటున్నారు. కాకపోతే చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించిన టైటిల్ ని ఫిలిం ఛాంబర్ కూడా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఒకేసారి పవన్ పుట్టినరోజున పవన్ తాజా చిత్ర ఫస్ట్ లుక్ తోపాటు చిత్ర టైటిల్ ని కూడా విడుదల చేద్దామన్న ఉద్దేశ్యంతోనే ఇప్పుడు టైటిల్ ని బయటపెట్టకుండా సీక్రెట్ గా ఉంచారని సమాచారం అందుతుంది. ఇక ఫస్ట్ లుక్ లో పవన్ కొత్తగా కనిపిస్తాడని... అలాగే కొంచెం కోపంగా కనిపిస్తాడని టాక్ వినబడుతుంది. అంటే ఓ యాక్షన్ సీన్ నుండి ఆ ఫస్ట్ లుక్ ఫోటోని కట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ గా వదులుతారని చెబుతున్నారు. ఈ లుక్ తో పవన్ ఫాన్స్ కి పూనకాలు రావడం ఖాయమంటున్నారు.

మరి పవన్ కొత్త లుక్, టైటిల్ కోసం పవన్ ఫాన్స్ కాసుకోండి అనే సవాల్ విసురుతున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు. ఇక ఈ చిత్రంలో పవన్... కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువెల్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.

PSPK 25th Film First Look on September 2:

Pawan Kalyan's Surprise Gift to Fans on his Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs