Advertisement
Google Ads BL

బాలయ్య డబ్బులిచ్చి ఆడించలేదు..అంటే..?


రాజు గారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య మంచిది కాదనే కదా! అర్ధం. సరిగా ఇలాంటి మరో సమస్యకు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు నాంది పలికి చర్చకు దారి తీశాడు. బాలయ్య తన కెరీర్‌లో ఇప్పటివరకు థియేటర్ల వారికి డబ్బులిప్పించి సినిమా ఆడించలేదన్నాడు. తద్వారా సినిమాలను డబ్బులిచ్చి ఆడించుకునే స్టార్స్‌ కూడా ఉన్నారని చెప్పకనే చెప్పి, అగ్నికి ఆజ్యం పోశాడు. బాలయ్య అన్నాడు కానీ, బాలయ్య కానీ, తాను కానీ అని చెప్పలేదు. సో..మోహన్ బాబు కూడా తన సినిమాలని డబ్బులిచ్చే ఆడించి ఉంటాడా..!

Advertisement
CJ Advs

ఇక ఇదే సమయంలో బాలకృష్ణ నటించిన 'లెజెండ్‌, సింహా' చిత్రాలు బాగా హిట్టయ్యాయని చెప్పవచ్చు గానీ ఏకంగా ఒక సినిమా ఒక పట్టణంలో ఒకే థియేటర్‌లో 1000 రోజులు ఎలా ఆడింది? టీవీలో, శాటిలైట్‌లో, పైరసీలో కూడా లభిస్తున్న ఈచిత్రం ఒకేసారి వరుసగా నాలుగు క్యాలెండర్లు చూడటం ఇదేనని నాడు బోయపాటి కూడా ఈ ఏడాది సాధించిన ముఖ్యమైన నాలుగు అద్భుతాలలో ఒకటిగా చెప్పాడు. మరి ఆ చిత్రం వెయ్యిరోజులు ఎలా ఆడిందో? ఆ పట్టణ ప్రజలే సాక్ష్యం చెప్పాలి. బాలయ్య తనను ఈ వేడుకకు రమ్మని ఆహ్వానించాడని, తనకు చెన్నైలో పని ఉన్నా, ఈ వేడుకకు బాలయ్య పిలిచినందున హాజరయ్యానని సెలవిచ్చాడు మోహన్ బాబు. 

Mohan Babu Controversy Speech at Paisa Vasool Audio SM:

Mohan Babu controversial Comments on Tollywood Star Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs