Advertisement
Google Ads BL

బాలయ్య చెప్పాడు...టాలీవుడ్ కి రెండు కళ్ళని..!!


ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు సినిమా రాగాన్ని అభివృద్ధి చేస్తామని, చిన్న సినిమాలకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలుగుదేశం శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ చెప్పాడు . సోమవారం హైదరాబాద్ లో నంది అవార్డుల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు సినిమా హైదరాబాద్ లో స్థిరపడిందని, దీనిని సంపూర్ణంగా తరలిస్తామని చెప్పమని, రాష్ట్రాలు రెండు అయినా భాష ఒక్కటే కాబట్టి  పరిశ్రమ రెండు చోట్లా ఉండొచ్చని చెప్పాడు.. 

Advertisement
CJ Advs

అయితే చిన్న సినిమాలను ఏవిధంగా ప్రోత్సహించాలా అని ఆలోచిస్తున్నామని, త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. తెలుగు సినిమా ఇటు  తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. సినిమాకు సంబంధించి ఇరు ప్రభుత్వాలతో మాట్లాదామని చెప్పారు. టాలీవుడ్ కి రెండు ప్రభుత్వాలు రెండు కళ్ళు అని ఆయన అభివర్ణించారు 

2012, 13 సంవత్సరాల సినిమాలకు నంది అవార్డులను కమిటీలు నిర్ణయించాయి. ప్రస్తుతం 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ కొత్త కమిటీలను ప్రకటించామని బాలకృష్ణ చెప్పాడు. 

డిసెంబర్లో అన్ని అవార్డులు కలిపి రెండు రోజులపాటు అమరావతిలో జరిగే ఉత్సవాలలో ప్రధానం చేస్తామని ఆయన తెలిపారు. నంది అవార్డ్స్ 1964లో ప్రవేశ పెట్టారని, 50 సంవత్సరాల వేడుకలను వైభవంగా జరిపిస్తామని ఆయన చెప్పారు. అలాగే టి ,వి వచ్చి కూడా 25 సంవత్సరాలు అవుతుంది.. ఆ ఉత్సవాలని కూడా జరుపుతామని చెప్పారు. 

ఎఫ్.డి.సి  చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామని చెప్పారు.. తెలుగు సినిమా రంగం ఏపీ లో కూడా స్థిరపడేలా సదుపాయాలు చేస్తున్నామని చెప్పారు. 

ఈ సమావేశంలో ఎఫ్.డి.సి ఎం.డి  వెంకటేశం, మూడు సంవత్సరాల కమిటీలు పాల్గొన్నాయి. 

Balakrishna talks About Tollwood Industry:

Balakrishna says AP and Telangana are Tollywood Two Eyes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs