Advertisement
Google Ads BL

పవన్ అందుకే వెనక్కి తగ్గాడా...?


పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ కోసం పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లుక్ తోపాటు సినిమా టైటిల్ కూడా ఏమై ఉంటుందా అనే ఉత్సుకతతో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి, ఆ సినిమా లుక్, టైటిల్ వదలకుండా చిత్ర యూనిట్ తాత్సారం చేస్తూనే ఉంది. ఇకపొతే పవన్ కళ్యాణ్ తాజా చిత్ర లుక్ సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు కానుగా వదులుతున్నారనే ఆఫీషియల్ ఎనౌన్సమెంట్ లా హారిక హాసిని క్రియేషన్స్ వారు ఒక పోస్టర్ తయారు చేసి మరీ... సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఏమైందో ఏమో ఆ పోస్టర్ పెట్టిన కొన్ని గంటల్లోనే దాన్ని మాయం చేశారు.

Advertisement
CJ Advs

మరి పవన్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ వదలడం ఇష్టం లేక మేకర్స్ ఆ పని చేశారా? లేకుంటే ఏదైనా టెక్నీకల్ ఇష్యూస్ వచ్చాయో తెలియదు గాని ఇప్పుడు మాత్రం పవన్ - త్రివిక్రమ్ ల ఫస్ట్ లుక్ పవన్ బర్త్ డే కి వచ్చే ఛాన్స్ లేదనే సంకేతాలు అందుతున్నాయి. అసలు దీనికి కారణం ఏమిటంటే... త్రివిక్రమ్, పవన్ ల సినిమా షూటింగ్ నత్త నడక కారణంగా అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్తా సంక్రాంతికి వెళ్ళిపోయింది. మరి అలా సంక్రాంతి బరిలో ఉన్న ఆ సినిమా విడుదలకు ఇంకా ఐదు నెలలు టైం ఉంది. ఇప్పుడు ఈ ఐదు నెలల ముందే ఇలా సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ వదలడం వల్ల సినిమా మీద క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందనే యోచనలో చిత్ర యూనిట్ ఉందట. 

అలాగే ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ఇంత తొందరగా పబ్లిసిటీ మొదలెడితే కనీసం నెలకోసారైనా ఈసినిమాకి సంబందించిన లుక్ గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని... ఇలా ఎదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టే పవన్ పుట్టిన రోజుకి ఆ ఫస్ట్ లుక్ వదిలే ఆలోచన చిత్ర యూనిట్ విరమించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. చూద్దాం సెప్టెంబర్ 2  న ఏం జరగబోతుందో?

No First Look on Pawan Kalyan's Birthday:

PSPK 25 Film makers have dropped the idea of releasing first look and the title logo of the film due to obvious reasons.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs