Advertisement
Google Ads BL

'వాలుజడ' తో మతిపోగొడుతుంది..!


'కబాలి' లో రజినీకాంత్ కూతురుగా నటించి అందరి ప్రశంసలందుకున్న సాయి ధన్సిక  లీడ్ రోల్ ప్లే చేస్తున్న బైలింగ్వల్ మూవీ ‘వాలుజడ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసింది. యదార్ద సంఘటనల ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. సెప్టెంబర్ నుండి మరో భారీ షెడ్యూల్ జరగబోతోంది. తమిళ దర్శకులు చేరన్, గౌతమ్ మీనన్, విక్రమ్ కుమార్ ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమణ మల్లం 'వాలుజడ' తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Advertisement
CJ Advs

'కబాలి' చిత్రం కోసం గుండు చేయించుకున్న ధన్సిక..ఇప్పుడు సినిమా టైటిల్ కి తగ్గట్లుగా చక్కని చీర కట్టుతో..వాలుజడ తో చూడ చక్కగా వుంది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రదర్శించిన ధన్సిక.. ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో చేస్తుంది.  టాప్ హీరోయిన్ గా నిలబడాలని ఎన్నో కలలు కంటున్న ధన్సిక.. ఈ వాలుజడ తో తన కోరికను తీర్చుకుంటుందేమో చూద్దాం. 

శరణం గచ్ఛామి, జానకి రాముడు లాంటి సినిమాల్లో నటించిన నవీన్ సంజయ్ 'వాలుజడ' లో హీరోగా నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ పాత్రలో వెటరన్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ నటిస్తుండటం విశేషం.

Sai Dhansika's Vaalu Jada First Look Launched:

Star Heroine Kajal Agarwal unveiled the first look of Sai Dhansika's 'Vaalu Jada'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs