ఒక్క మెతుకు పట్టుకుంటే పాత్రలో వున్న రైస్ భవిష్యత్ తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్లు చాలామంది వస్తున్నా..వారిలో కొంతమంది మాత్రమే హీరోయిన్ లు గా నిలబడి కొంతకాలం పాటు టాప్ హీరోయిన్లు గా నిలబడుతున్నారు. ఒక 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే కొందరు మాత్రం 10 సినిమాలు చేసినా కలకాలం ఉండేలా పేరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు తమ గ్లామర్ తో ఇండస్ట్రీలో పెత్తనం చెలాయించాలని ట్రై చేసినా..అది రెండు మూడు సినిమాల వరకే పరిమితం అవుతుందని అంతే త్వరగా తెలుసుకుని కనుమరుగై పోతున్నారు.
అయితే కొందర్ని హిట్ లు లేకపోయినా ప్రేక్షకులు నెత్తినపెట్టి చూసుకుంటారు. అభినయం, అందం అన్ని కలగలిపిన కొందరు అప్పుడప్పుడూ వస్తుంటారు. అలాంటి భామే అను ఇమ్మాన్యువల్. ఈ భామ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క చిన్న సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించిన అను..ఇప్పుడు స్టార్ హీరోలతో అవకాశాలు పొందుతూ..ఫ్యూచర్ టాప్ హీరోయిన్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తున్న అను.., అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్లతో అవకాశాలు పొందుతూ..డౌట్ లేదు..నెక్స్ట్ నేనే అంటూ టాప్ హీరోయిన్ లకు సవాల్ విసురుతోంది.