బిగ్ బాస్ షో మా ఛానల్ లో మొదలైనప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్నాడు కాబట్టి ఆ షోకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రేక్షకుల అంచనాలకి రీచ్ అయ్యి మరి.. తన హోస్టింగ్ తో అదరగొడుతూనే వున్నాడు. కాకపోతే మధ్యలో ఐదు రోజులు మాత్రం ఈ షో కి నెగెటివ్ టాక్ వచ్చేస్తుంది. రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ అభినయంతో అదరగొడుతున్న ఈ షో మిగతా రోజుల్లో, షోలో కంటెస్టెంట్స్ వల్ల షో పెద్దగా ప్రేక్షకులకు ఎక్కడం లేదనే టాక్ మొదటి నుండి ఉంది. అయితే షో మొదలైన రెండు వారాలు ఈ షోకి టీవీలో టాప్ రేటింగ్ వచ్చేసి స్టార్ మా ఛానల్ ఏకంగా ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించేసింది.
మరి ఇప్పుడు ఈ నాలుగు వారాల తర్వాత టీఆర్పీ రేటింగ్స్ లో బిగ్ బాస్ షో మరీ వెనుకబడిందని సమాచారం. జెమినీ లో రానా హోస్ట్ గా వస్తున్న నెంబర్ వన్ యారి మొదటి నుండి ఎన్టీఆర్ బిగ్ బాస్ తో పోటీపడుతూనే ఉంది. కానీ మొదట్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ ముందు ఈ రానా షో రేటింగ్స్ లో వెనుకబడిపోయింది. తమిళ్ లో కమల్ హాసన్ చేస్తున్న బిగ్ బాస్ కి, తెలుగు ఎన్టీఆర్ బిగ్ బాస్ కి ఇప్పుడు తేడా లేకుండా..చాలా వీక్ గా తయారయింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న టీఆర్పీ రేటింగ్స్ లో రానా... పై చెయ్యిని సాధించగా బిగ్ బాస్ తో ఎన్టీఆర్ వెనకంజలో ఉన్నాడంటున్నారు.
తాజాగా విడుదల చేసిన టీఆర్పీ రేటింగ్స్ లో రానా.. నెంబర్ వన్ యారి షో 9.4 తెచ్చుకుంటే, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి మాత్రం ఎన్టీఆర్ 2 రోజుల ఎపిసోడ్స్ కి గాను 6.58 రేటింగ్ సంపాదించుకుంది. ఇక మిగతా షోలలో బోల్ బేబీ బోల్ 6, ఎక్స్ట్రా జబర్దస్త్ 5.6 రేటింగ్స్ తెచ్చుకున్నాయి. ఇకపోతే ముందు నుండి టీవీ సీరియల్స్ కి ఎప్పుడు ఉండే మహిళాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటిలాగే కుంకుమపువ్వు - 10.7, స్వాతిచినుకులు - 10, ముద్దమందారం-10 రేటింగ్స్ పొందాయి.
ఇక రియాలిటీ షోస్ లో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి రేటింగ్ తగ్గడం చూస్తుంటే ఎన్టీఆర్ ఎనర్జీ, ఆయన పెరఫార్మెన్సు, ఎన్టీఆర్ స్టైల్, గేమ్ ఆడే స్టయిల్ కూడా ఏమాత్రం పని చేయడంలేదని టాక్ వినబడుతుంది. ఇక ఈ షో ఇప్పటి వరకు దాదాపు 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని మరో 30 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉంది.