Advertisement
Google Ads BL

హిట్ కొట్టినా..ఈ డైరెక్టర్ కి ఇంకా అనుమానమే!


డెబ్యూ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాతగా... విజయ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' నెగటివ్ పబ్లిసిటీతో పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఆనాటి 'దేవదాసు' చిత్రాన్ని తలపిస్తూ ఈనాటి తరానికి సూటయ్యే దేవదాసులా ఉందంటూ యువత 'అర్జున్ రెడ్డి'కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ లు బావుంటాయనే కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. మరి యూత్ ఐకాన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒకవేళ స్టార్ హీరోని ఎవరినైనా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారని.... 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ ని అడగా దానికి సందీప్‌ రెడ్డి వంగా..ఏమంటున్నాడంటే..

Advertisement
CJ Advs

ఈ 'అర్జున్ రెడ్డి' కేరెక్టర్ ని ఒక స్టార్ హీరో చెయ్యాలి అంటే అది కేవలం అల్లు అర్జున్ మాత్రమే చేయగలడని... ఈ పాత్రని అల్లు అర్జున్ అద్భుతంగా పండించేవాడని చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నా సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాణంలో తెరకెక్క బట్టే ఇంతటి విజయం సాధించిందని.... వేరే నిర్మాత అయితే ఈ సినిమా విషయంలో కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వచ్చేదని చెబుతున్నాడు. తన సోదరుడు వలనే తాను ఇంత కంఫర్ట్ గా ఈ సినిమా చేయగలిగానని చెప్పిన ఈయన... వేరే నిర్మాత అయితే ఈ 'అర్జున్ రెడ్డి' టీజర్, ట్రైలర్ విడుదలప్పుడే అడ్డుచెప్పేవారని.... అంటున్నాడు.

అలాగే ఈ 'అర్జున్ రెడ్డి' ని వేరే నిర్మాత వద్దనుకోవడానికి కారణం మాత్రం 'అర్జున్ రెడ్డి' కథే అంటున్నాడు. అయితే ఇదివరకే అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలనుకున్నాను... అలాగే ఒక కథ కూడా వినిపించాను. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ 'అర్జున్ రెడ్డి' కథను అల్లు అర్జున్ కి చెప్పడానికి ట్రై చేసినా కుదరకపోవడం వలెనే విజయ్ ని హీరోగా ఈ సినిమా చేశానని చెబుతున్నాడు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్. అయితే అల్లు అర్జున్ తో ఇప్పట్లో సినిమా చెయ్యలేనేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం అల్లు అర్జున్ వేరు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ వేరంటున్నాడు. చూద్దాం 'అర్జున్ రెడ్డి' చూశాక ఈయనకు అల్లు అర్జున్ పిలిచి డైరెక్షన్ ఛాన్స్ స్తాడేమో?

Arjun Reddy Director Doubts on Allu Arjun Chance:

Sandeep Reddy Waiting for Allu Arjun Movie Chance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs