Advertisement
Google Ads BL

'పైసా వసూల్‌'.. పూరీకి క్రెడిట్‌ దక్కడం లేదు!


ఒకప్పుడు పూరీ జగన్నాథ్‌ పరిచయం చేసే హీరోయిన్లు, ఐటం భామలంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. నాడు ఆయన పరిచయం చేసిన రక్షిత, ఆసిన్‌, హన్సిక, వంటి వారితో పాటు అనుష్క, ముమైత్‌ఖాన్‌ వరకు అందరూ కొంతకాలం ఓ వెలుగు వెలిగిన వారే. ఇక మొదటి చిత్రాలు కాకపోయిన ఇలియానా, అమలాపాల్‌, కేథరిన్‌ వంటివారు కూడా బాగానే మెప్పించారు. 

Advertisement
CJ Advs

కానీ ఏక్‌నిరంజన్‌ లో నటించిన కంగనా రౌనత్‌తో పాటు 'హార్ట్‌ఎటాక్‌, లోఫర్‌' వంటి చిత్రాలలో నటించిన భామలు సరిగా మెప్పించలేకపోయారు. 'ఇజం'తో పరిచయం చేసిన ఆదితి ఆర్యా, 'రోగ్‌'లో నటించిన మన్నార్‌చోప్రా, ఎంజేలాలు సరిగా మెప్పించలేదు. ఇక పూరీ తాజాగా మరోసారి రీబౌన్స్‌ కావాలని, 'లోఫర్‌, ఇజం, రోగ్‌' ఫ్లాపలన్నింటినీ పక్కకు పెట్టి బాలయ్యతో తొలిసారి చేస్తున్న 'పైసా వసూల్‌'తో తన స్టామినాను మరలా ప్రూవ్‌ చేసుకుని, మరోసారి తన వెంట స్టార్‌ హీరోలు క్యూకట్టేలా చేయాలనే కసితో ఉన్నాడు. 

పడిన ప్రతిసారి పైకి లేచి పరుగెత్తే పూరీ 'పైసా వసూల్‌' తర్వాత తనను పక్కనపెట్టిన చిరంజీవి, వెంకటేష్‌, మహేష్‌బాబులపై తన ఆధిపత్యాన్ని చూపించాలని తపన పడుతున్నాడు. ఇక ఈ 'పైసా వసూల్‌'లో తేడా సింగ్‌ బాగానే ఉన్నా, ఆయన సరసన ఆల్‌రెడీ నటించిన శ్రియాశరన్‌తో పాటు కొత్తగా పరిచయం చేస్తున్న ముస్కాన్‌ సేథీ, కైరాదత్‌లు మాత్రం ఈచిత్రం ట్రైలర్‌లో బాగా ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఈ హీరోయిన్ల సెలక్షన్‌ తప్పని కూడా కామెంట్స్‌ వస్తున్నాయి. మరి ట్రైలర్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ ముస్కాన్‌సేధీ, కైరా దత్‌లు సినిమాలో కథాపరంగా అయినా ఆకట్టుకుంటారో లేదో వేచిచూడాల్సివుంది...! 

Paisa Vasool Heroines: Puri Wrong Selection:

No Special Image to Paisa Vasool with Heroines
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs