Advertisement
Google Ads BL

తమన్నా పడింది..మళ్లీ లేస్తుందా?


టాలీవుడ్ లో తమన్నా పనైపోయిందని టాక్ నడుస్తుంది. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత తమన్నా మరలా ఏ సినిమాలో నటించడంలేదు. అసలు తమన్నాకి ఉన్నట్టుండి ఒక్కసారే ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే అమ్మడుకి బాలీవుడ్ లో ఏవో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ... అక్కడ ఇంతకుముందే ఎలాంటి సక్సెస్ లేకుండా ఉన్న తమన్నాకి ఇప్పుడు ఉన్న ఆఫర్స్ కూడా ఏమంత చెప్పుకోదగినవి కాదంటున్నారు. మరోపక్క ఒకటి అరా తమిళ్ సినిమాలతో కెరీర్ ని నెట్టుకొస్తున్న తమన్నాకి ఇప్పుడో తెలుగు ఆఫర్ తగిలింది.

Advertisement
CJ Advs

కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరెక్షన్ లో, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి. కళ్యాణ్ రామ్ తాజాగా 'ఎమ్యెల్యే' చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు తమన్నాతో జోడి కట్టబోతున్నాడు. మరి కళ్యాణ్ రామ్ కి తమన్నా అంటే చెప్పుకోదగిన విశేషమే కానీ... తమన్నాకే కళ్యాణ్ రామ్ జోడి అంటే నమ్మలేమంటున్నారు కొందరు. ఏదిఏమైనా తమన్నా రేంజ్ పడిపోయిందంటున్నారు.

ఎప్పుడూ స్టార్ హీరోలపక్కనే జోడి కడుతూ చెప్పుకోదగ్గ బాహుబలి మినహా బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా మీడియం రేంజ్ హీరోలతో పెద్దగా నటించని తమన్నాకి ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఆఫర్ వలన మీడియం రేంజ్ హీరోల పక్కన నటించే ఛాన్స్ లు పెరుగుతాయని అంటున్నారు. చూద్దాం తమన్నా కెరీర్ ఇకముందు ఎలా వుండబోతుందో? మళ్లీ లేస్తుందా?

Tamanna in Kalyan Ram Film:

Tamanna Got chance in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs