Advertisement
Google Ads BL

పెళ్ళికి ముందే వాడకం మొదలెట్టాడు..!


నాగచైతన్య 'యుద్ధం శరణం' విడుదలకు సిద్దమయ్యింది. సెప్టెంబర్ 8న రాబోతున్న ఈ చిత్రానికి ఆశించిన రీతిలో క్రేజ్ రాలేదనుకున్నాడేమో నాగచైతన్య... అందుకే ఈ సినిమాకి వీలైనంత క్రేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా తన విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పవుడే నాగ చైతన్య కి కాబోయే వైఫ్ సమంత ఈ 'యుద్ధం శరణం' ని ప్రమోట్ చేస్తూ తనకు కాబోయే భర్త నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్ చెప్పింది.

Advertisement
CJ Advs

ఆ తరహాలోనే ఇప్పుడు నాగ చైతన్య 'యుద్ధం శరణం' ఆడియో లాంచ్ వేడుకకి అక్కినేని ఫ్యామిలీలోని నాగచైతన్య తమ్ముడు అఖిల్, కాబోయే భార్య సమంత, నాగ చైతన్య మేనమామ వెంకటేష్ లు హాజరవుతున్నారు. మరి చైతు - సామ్ ల పెళ్ళికి ముందే విడుదల కాబోయే చిత్రం కాబట్టి నాగ చైతన్య ఈ చిత్రంపై స్పెషల్ కేర్ చూపిస్తున్నాడంటున్నారు. అందులో భాగంగానే ఈనెల 27న జెఆర్సీ ఫంక్షన్ హాలులో జరగబోయే ఆడియో వేడుకకి ఇలా తన ఫ్యామిలీని తీసుకొచ్చే ఏర్పాట్లలో చైతు ఉన్నాడనే టాక్ వినబడుతుంది.  

అయితే వెంకటేష్ ఇంతకుముందే నాగ చైతన్య 'ప్రేమమ్' సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. చైతుకి సపోర్ట్ గా ప్రిన్సిపాల్ తో మాట్లాడే సీన్ లో నటించిన వెంకీ ఇప్పుడు మేనల్లుడు చైతు కోసం ఇలా 'యుద్ధం శరణం' ఆడియోకి రావడం మాత్రం మేనల్లుడుపై ప్రేమని తెలియజేస్తుంది.

Samantha Guest to Yuddham Sharanam audio:

Venkatesh, Akhil and Samantha Attends Naga Chaitanya's Yuddham Sharanam Audio
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs