Advertisement
Google Ads BL

బాలకృష్ణ 102 - బోయపాటి 'సింహా 2'..?


బాలకృష్ణ తన 102 వ చిత్రాన్ని కెఎస్ రవికుమార్ డైరక్షన్ లో మొదలుపెట్టడమే కాదు షూటింగ్ లో కూడా జోరుగా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.. డైరెక్టర్ మరియు హీరో బాలయ్యలు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటిస్తుంది. నయనతార కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యింది. మరి ఈ చిత్రంలో నయనతార ని సెలెక్ట్ చేసినట్లు చెప్పిన నిర్మాత సి కళ్యాణ్ ఆమె మెయిన్ హీరోయిన్ కాదు మరొక ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్న విషయం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే నయనతార ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ కాదని... బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ మాత్రమే అని వార్తలొస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ బాలకృష్ణ కి వైఫ్ గా నయనతార నటిస్తుంటే.... మెయిన్ స్టోరీ లో మరొక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారనే  టాక్ బయలుదేరింది. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనబడతాడని.. ఫ్లాష్ బ్యాక్ బాలకృష్ణ ఒకరైతే మరొకరు మెయిన్ స్టోరీలో ఉంటారనే న్యూస్ కూడా ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అయితే మెయిన్ కథలోని బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారనే టాక్ కూడా ఉంది.

మరి ఈ కథ మొత్తం చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. అది బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' సినిమా గుర్తుకురావడంలేదు. ఆ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ నయనతార అయితే రియల్ స్టోరీ హీరోయిన్స్ నమిత, స్నేహ ఉల్లాల్ లు. మరి అచ్చం సింహా సినిమా పోలిన కథతో వస్తున్న ఈ బాలయ్య 102 వ చిత్రాన్ని కెఎస్ రవికుమార్ ఎలాంటి కొత్తదనంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడో చూద్దాం.

Balakrishna 102 film Similar to Simha Story:

Balakrishna 102 Movie Latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs