Advertisement
Google Ads BL

తాతయ్యకి కిస్ పెట్టి మరి.. సవాల్ విసిరాడు!


'అర్జున్‌రెడ్డి'లోని హీరోహీరోయిన్ల మద్య వచ్చే లిప్‌లాక్‌ సీన్‌ని పబ్లిసిటీగా వాడుకుంటూ ఉంటే కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావు ఆ పోస్టర్లపై మండిపడి.. ఆ పోస్టర్లను చించేసిన సమస్య ఇంకా వార్తల్లో నానుతూనే ఉంది. ఈ పోస్టర్‌ మీలాంటి వారి కోసం కాదు తాతయ్యా... అని వర్మ వ్యాఖ్యానించడం, చీర్స్‌ తాతయ్య అని పోస్ట్‌ చేయడంతో హైదరాబాద్‌కి వర్మని రానివ్వమని వీహెచ్‌ అన్నారు.

Advertisement
CJ Advs

దానికి వర్మ బదులిస్తూ నేను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నాను.. ఉదయం 10.30షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి సినిమా చూడటానికి వెళ్తున్నాను. బస్తీమే సవాల్‌. ఈ కిస్‌ హీరోయిన్‌ నీకు ఇవ్వనందుకు కోపంగా ఉందా? నన్ను కాదు.. సినిమాకి వచ్చే నీ మనవళ్లు, మనవరాళ్లు వయసు ఉన్న యూత్‌ని నీకు దమ్ముంటే ఆపు.. అని రెచ్చగొట్టాడు.

ఇక వర్మ, వి. హనుమంతరావుని ఉద్దేశించి ఆయనకు వర్మ ముద్దుపెడుతున్న ఫోటోని గ్రాఫిక్స్‌లో తయారు చేసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులోఆయన వీహెచ్‌ బుగ్గలపై ముద్దుపెడుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్ర నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్‌ కోసం వీహెచ్‌కి ఏదో ఇచ్చినట్లుగా ఉందని, దాంతోనే ఆయన రెచ్చిపోతున్నాడని నానా మాటలు అంటున్నాడు. 

మొత్తానికి వీహెచ్‌ ద్వారా ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీనే లభించింది. దీనికి వర్మ తోడవ్వడంతో లక్షలు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ, ప్రమోషన్లు మాత్రం ఈ చిత్రానికి వచ్చాయి. దాంతో ఈచిత్రం మొదటి వారం కలెక్షన్లకు మాత్రం ఢోకా లేదని అంటున్నారు.

RGV throws an open challenge to VHR:

Ram Gopla Varma Funny Satirical Punches on Politician V Hanumantha Rao for Arjun Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs