Advertisement
Google Ads BL

రామ్ చరణ్ ఏంటి.. ఇలా షాక్ ఇచ్చాడు..?


రామ్ చరణ్ - సమంత జంటగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్రం ఈ దసరా బరిలోనే ఉంటుంది అనుకుంటే ఆబ్బె లేదు వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అంటూ చిత్ర టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇక ఆ మధ్యన అయితే సంక్రాంతి కన్నా ముందే అంటే డిసెంబర్ లో రామ్ చరణ్ తన రంగస్థలంతో రాబోతున్నాడంటూ కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం స్టార్ట్ అయ్యింది. రామ్ చరణ్ 'రంగస్థలం' వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడులవుతుందని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం ఇంతలా డిలే అవ్వడానికి కారణం ఉందట. అదేమిటంటే డైరెక్టర్ సుకుమార్  తన ఓన్ బ్యానర్ లో చేసిన 'దర్శకుడు' చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాలలో ఉండడంతో కొన్ని రోజులు రంగస్థలాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందట. అలాగే రామ్ చరణ్ కూడా తన తండ్రి 'సై రా' సినిమా నిర్మాతగా వ్యవహరించడం వలన ఈ మధ్యన జరిగిన సినిమా లోగో లాంచ్, మోషన్ పోస్టర్ వ్యవహారాల్లో తల మునకలవడంతో 'రంగస్థలం' షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడట. ఇక మరొక కారణం వలన కూడా రామ్ చరణ్ 'రంగస్థలం' లేట్ అయ్యేలా ఉండడం వలన ఈ సినిమా ఇలా ఏప్రిల్ బరిలోకి వెళ్ళిందంటున్నారు.

ఇక మూడోది సమంత వలన ఈ చిత్ర షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందేమో అంటున్నారు. సమంత అక్టోబర్ లో పెళ్లి వలన కూడా 'రంగస్థలం' షూటింగ్ కి బ్రేక్ పడొచ్చనే ప్రచారం జరుగుతుంది. మరి డైరెక్టర్ సుకుమార్ సినిమా అంటే చాలా లేట్ అనే నానుడి ఉండనే ఉంది. మరి చూద్దాం ఈ చిత్రంతో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోయే చిత్రంతో పోటీపడతాడో లేకుంటే వచ్చే వేసవికి ఆరమ్స్ గా వస్తాడో చూద్దాం.

Rangasthalam 1985 to Release in April, 2018?:

Speculations are rife that Rangasthalam 1985 may be released on April 20 as a summer gift for the audience.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs