బాలకృష్ణ కి 'రైతు' సినిమాకి 'నో' చెప్పిన బాలీవుడ్ నటుడు అమితాబ్.... ఇప్పుడు చిరు 'సై రా' నరసింహారెడ్డి కి 'ఎస్' అని చెప్పడంతో.. ఆయన బాలయ్యని అవమానించాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అమితాబ్ కి చిరు అంటే ప్రేమ..బాలయ్య అంటే ద్వేషమా? అంటూ వార్తలు వినిపించాయి. అయితే అమితాబ్ బాలకృష్ణ - కృష్ణవంశీల కాంబినేషన్లో తెరకెక్కనున్న 'రైతు' కి 'నో' చెప్పడానికి... చిరంజీవి 'సై.. రా' కి 'ఎస్' చెప్పడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. అందులో నిజమెంతుందో తెలియదు గాని ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
బాలకృష్ణ, కృష్ణవంశీ లు ఇద్దరూ కలిసి సాక్షి రామ్ రెడ్డి రాసిన 'రైతు' కథతో మెగాస్టార్ అమితాబచ్చన్ ని... 'రైతు' సినిమాలోని రాష్ట్రపతి కేరెక్టర్ కోసం ఒక నిమిషంన్నర పాత్ర చెయ్యమని అడగడానికి ముంబై వెళ్లగా... 'రైతు' కథ విన్న అమితాబచ్చన్ ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుని... ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని ఇలా ఏదన్న సినిమాలో ఒక నిమిషంన్నర పాత్ర చెయ్యమంటే ఎలా ఉంటుంది అనే అర్ధం వచ్చేలా మాట్లాడినట్టుగా టాక్. అయితే ఎలాగైనా అమితాబ్ ని తమ 'రైతు' చిత్రంలో నటింపచేయాలనే ఉద్దేశ్యంతో ఆ పాత్ర నిడివి పెంచి పోషించాగా మన్నా... దానికి అమితాబ్ ఇప్పుడు ఈ కేరెక్టర్ నిడివి పెంచినా బాగుండదని.... సున్నితం తిరస్కరించినట్లు చెబుతున్నారు.
అయితే అక్కడ 'రైతు' విషయం తెలుసుకున్న చిరు అండ్ కో తమ 'సై రా' సినిమాలో అమితాబ్ చెయ్యను అని చెప్పడానికి స్కోప్ లేకుండా తమ సినిమాలో అమితాబ్ పాత్రని తీర్చి దిద్దారట. ఇక 'సై రా నరసింహారెడ్డి'లో అమితాబ్ పాత్ర నిడివిఎక్కువగా చేసి అమితాబ్ కి వినిపించగా దానికి అమితాబ్ 'ఎస్' చెప్పాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ విషయంలో నిజంగా నిజమెంతుందో తెలియదు గాని ఇప్పుడా న్యూస్ టాప్ ట్రేండింగ్ లో ఉంది.