Advertisement
Google Ads BL

'సై..రా' లో చనిపోతాడంట..!


మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'సై..రా.. నరసింహారెడ్డి'లో ఓ పాత్ర చేయడానికి తమిళ వైవిధ్యనటుడు విజయ్‌సేతుపతి ఓ కీలకపాత్రను ఒప్పుకోవడం తెలుగులోనే కాదు.... తమిళంలో కూడా మరింత ఆసక్తిని కలిగిస్తోంది. విజయ్‌సేతుపతి నటించిన కొన్ని చిత్రాలు ఫ్లాప్‌ అయివుండవచ్చుగానీ ఆయన చేసిన ఏ పాత్రా కూడా విమర్శలను పొందలేదు. ఆయన ఓ చిత్రం చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా వైవిధ్యభరితమైన పాత్రే అని తమిళ ప్రేక్షకులు అంటారు. అలాంటి విజయ్‌ సేతుపతి చిరంజీవి చిత్రం అనడంతో క్యారెక్టర్‌ ఏమిటి? అని కూడా అడగకుండా ఓకే చెప్పాడట. తనను చేయమని అడుగుతున్నారంటే ఆ పాత్ర ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందనేది విజయ్‌ సేతుపతి అభిప్రాయం. 

Advertisement
CJ Advs

విజయ్ ది ఈ చిత్రంలో బ్రిటిష్‌ పాలకులకు అంగరక్షకునిగా ఉండే పాత్ర అని తెలుస్తోంది. మొదట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అపార్దం చేసుకుని, ఆయనకు వ్యతిరేకంగా బ్రిటిష్‌వారికి సహాయం చేసే పాత్రలో నటిస్తాడు. ఈ పాత్ర చివరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అర్దం చేసుకుని, ఆయన వైపుకి చేరి ఉయ్యాలవాడ పాత్రతో సహా తాను కూడా బ్రిటిష్‌ వారిపై పోరాడి... చివరకు అసువులు ధారబోసే పాత్ర అని తెలుస్తోంది.

ఈ చిత్రంలోని ఆయన పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌, పవర్‌ఫుల్‌గా సాగే పాత్ర చివరకు ప్రేక్షకుల చేత కన్నీరును పెట్టించే విధంగా ఉంటుందని ఈ చిత్ర యూనిట్‌ ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. మరి ఈ చిత్రం విజయ్‌సేతుపతి పాత్ర ద్వారా తమిళ ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ఆయన పాత్ర తమిళంలో క్రేజ్‌ రావడానికి ఎంతో హెల్ప్‌ కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 

Vijay Sethupathi Role in Sye Raa Narasimha Reddy:

Vijay Sethupathi Negitive and Positive roles in Sye Raa Narasimha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs