Advertisement
Google Ads BL

మహానుభావా..మాకేంటీ ఓసీడీ..?


అప్పట్లో కొన్ని A కంటెంట్ సినిమాలు తీసి బూతు సినిమాల డైరెక్టర్ గా పేరుపొందిన మారుతి, నాని హీరోగా 'భలే భలే మగాడివోయ్' వంటి డిఫరెంట్ మూవీతో క్లీన్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇందులో హీరో నానికి మతిమరుపు ఉంటుంది. మతిమరుపు కాన్సెప్ట్ తో డైరెక్టర్ మారుతి 100 శాతం మార్కులు కొట్టేశాడు ఈ సినిమాకి. అలాంటి మతిమరుపు లక్షణాలున్న నాని ఈ సినిమా మొత్తం వినోదంతోనే అరిపించేశాడు. అయితే ఇప్పుడు అలాంటి మరో కాన్సెప్ట్ తోనే శర్వానంద్ హీరోగా 'మహానుభావుడు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ గురువారం ఉదయం విడుదల చేసింది చిత్ర యూనిట్.

Advertisement
CJ Advs

ఆనంద్ రోల్ లో శర్వానంద్ రిచ్ కిడ్ గానే కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్ లో శర్వానంద్  'నా పేరు ఆనంద్..నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్ డిగ్రీలాంటిది కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం...' అంటూ చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. మరి అతి శుభ్రం అంటే ఎలా ఉండబోతుందో కూడా ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించేశారు. చేసిందే చెయ్యడం.... తోమిందే తోమడం... కడిగిందే కడగడం ఇవి అతి శుభ్ర లక్షణాలన్నమాట. కనీసం ఎదుటివాడి తుమ్ముకు భయపడి దూరంగా వెళ్లిపోవడం, అలాగే  హీరోయిన్ మెహరీన్ కాళ్లతో కాళ్ళు కలపాలన్నా స్ప్రే కొట్టి మరీ క్లిన్ చెయ్యడం, ఆఖరికి హీరోయిన్ కి ముద్దు పెట్టాలన్నా ఆమెని బ్రెష్ చేసుకున్నావా అని అడగడం చూస్తుంటే మాత్రం హీరో అతిగా శుభ్రత పాటించే వాడిగా సూపర్ కామెడీతో ఈ సినిమాలో ఆకట్టుకునేలాగే కనబడుతున్నాడు.

ఇక ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్ వారు నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 'జై లవ కుశ, స్పైడర్' చిత్రాలకి పోటీగా దసరా బరిలో నిలపాలనే ఆలోచనలో డైరెక్టర్ మారుతి, హీరో శర్వానంద్ లు ఉన్నారు.

Click Here To See the TEASER

Mahanubhavudu Teaser Talk:

Maruthi’s new flick Mahanubhavudu first look and teaser presented Sharwanand as Obsessive Compulsive Disorder patient.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs