Advertisement
Google Ads BL

ఎస్.ఎస్. రాజమౌళి.. అయితే ఏంటి?


సాయి కొర్రపాటి నిర్మాతగా రాజమౌళి అప్పట్లో తీసిన 'ఈగ' చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అప్పట్లో చిన్న హీరో అయినా నానిని 'ఈగ' గా చూపించి రాజమౌళి కొట్టిన హిట్ ఇండియా మొత్తం ముచ్చటించుకునేలా చేసింది. అయితే  హీరో లేకుండా సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన సాయి కొర్రపాటి అంటే రాజమౌళికి ఎనలేని గౌరవమే కాదు, విపరీతమైన అభిమానము కూడా. 'ఈగ' సినిమా అప్పటినుండి సాయి కొర్రపాటి, రాజమౌళిల స్నేహం బాగా బలపడింది. అందుకే సాయి కొర్రపాటి ఏదైనా సినిమాని నిర్మిస్తున్నాడు అంటే ఆ సినిమాకి రాజమౌళి విపరీతమైన పబ్లిసిటీ చేసేస్తున్నాడు. ఆ సినిమా కష్టమంతా తన భుజాలమీదే ఉన్నట్టు ఆ సినిమాకి ప్రమోషన్ చేసేస్తాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ మధ్యన రాజమౌళి ప్రమోషన్ కూడా సాయి కొర్రపాటి నిర్మించిన సినిమాలను కాపాడలేకపోతున్నాయి. సాయి నిర్మించిన సినిమాలు వరుసగా ప్లాపవ్వడంతో... మంచి చిత్రాలు తీసి కూడా సాయి కొర్రపాటి నష్టాలతో కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడు. 'మనమంతా, రెండు రెళ్లు ఆరు, పటేల్ సార్' వంటి సినిమాలు నిర్మించి కష్టాల్లో ఉన్న సాయిని ఆదుకోవడానికి రాజమౌళి రంగంలోకి దిగాడు. అంటే రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాత అనుకునేరు. విషయం అదికాదు... రాజమౌళి ఒక విషయంలో సాయి కొర్రపాటిని సేవ్ చేద్దామనుకున్నాడట.. కానీ అది కుదరలేదు.

ఆ సహాయం ఏమిటంటే శంకర్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా '2.0' సినిమా వస్తుంది. ఆ సినిమా తెలుగు హక్కులను సాయి కొర్రపాటికి ఇప్పించే బాధ్యతను రాజమౌళి తన భుజాన వేసుకున్నాడట. ఆ విషయంలోనే '2.0' నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ తో ఈ మేరకు చర్చలు కూడా జరిపాడట. ఆ బాధ్యత నెత్తిన వేసుకున్న రాజమౌళి, సాయి కొర్రపాటితో కలిసి చెన్నై వెళ్లి అక్కడ  లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో మీటింగ్ లో పాల్గొన్న రాజమౌళి '2.0' తెలుగు హక్కులని 60 కోట్లు కోట్ చెయ్యగా... దానికి '2.0' నిర్మాతలు ససేమిరా అన్నారట. వారు 80 కోట్లకు తగ్గిదే లేదని ఖచ్చితంగా చెప్పేశారట. తమ సినిమా తెలుగులో 100  కోట్లు కొల్లగొట్టడం ఖాయమని... మరీ 60 కోట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారట. ఇక రాజమౌళి '2.0' హక్కులు సాయి కి ఇస్తే సినిమాకి రాజమౌళి కూడా ప్రమోషన్ చేస్తాడని చెప్పినా... వారు వినకుండా... రాజమౌళి అయితే ఏంటి..? శంకర్ ఇక్కడ అన్నట్లుగా చివరకి ‘2.0’ హక్కుల్ని గ్లోబల్ సినిమాస్ వాళ్ళకి 80 కోట్లకి ఇచ్చేశారంట.

మరి రాజమౌళి స్వయంగా లైకా వారిని అడిగినా వారు ఒప్పుకోలేదంటే ఆ సినిమా మీద వారికెంత కాన్ఫిడెంట్ లేకపోతె పట్టుబట్టి మరీ 80 కోట్లకు '2.0' హక్కుల్ని అమ్మేస్తారు. రాజమౌళి ఎలాగైనా సాయికి '2.0' తెలుగు హక్కులు ఇప్పిద్దామని ట్రై చేసి చివరికి ఇలా భంగపడ్డాడన్నమాట.

Rajamouli Didn't Let Sai to Take up 2.0 Deal!:

2.0 movie's theatrical rights have been sold out for Rs.80 crores in Telugu states. It is learnt that Sai Korrapati of Varahi Creations had tried to acquire the movie's rights for Rs.60 crores before. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs