Advertisement
Google Ads BL

మహేష్ కూతురా..! మరాఠీ అమ్మాయా..!


సెలబ్రిటీస్ పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా అదొక సెన్సేషనే. మీడియా ఎప్పుడూ సెలబ్రిటీస్ మీద... వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద డేగ కన్ను వేసే ఉంచుతుంది. అయితే ఇప్పుడు మీడియాకి అంత శ్రమ ఇవ్వకుండా సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు తమ గురించి, తమ కుటుంబాల గురించి, తమ పిల్లల గురించి సాంఘిక మాధ్యమాల్లో అభిమానులకి, ప్రేక్షకులకి చేర వేస్తున్నారు. తమ సినిమా షూటింగ్స్ తోపాటు తమ ఇళ్ళలో జరిగే కార్యక్రమాల వరకు వారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో కొచ్చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక సెలబ్రిటీస్ అందరిలో మహేష్ బాబు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించకపోయినా.... ఆయన భార్య నమ్రత మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తమ పిల్లలు గౌతమ్, సితారలు చేసే అల్లరితోపాటే తాము వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో అనే విషయాల్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంది. ఇక ఎప్పటికప్పుడు తన కూతురు సితార చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే నమ్రత.. తాజాగా సితార భారత నాట్యం నేర్చుకుంటుందని... సితార ఫోటో ఒకటి పోస్ట్ చేసి మరీ చెప్పింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే మళ్ళీ రీసెంట్ గా సితార మరాఠీ అమ్మాయి వేషంలో అదరగొట్టే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. స్వతహాగా మహేష్ తెలుగు వాడైనప్పటికీ నమ్రత మాత్రం మహారాష్ట్ర అమ్మాయి. అందుకే నమ్రత తన కూతురు సితారకు మహారాష్ట్ర అమ్మాయి గెటప్ వేసింది. అయితే అదేదో సరదాకి కాదులెండి. సితార ఇప్పుడు కొత్తగా నాట్యం నేర్చుకుంటుంది కదా... అందుకోసమే నమ్రత, సితారని ఇలా తయారు చేసిందా అనే డౌట్ కొడుతోంది. మరోపక్క ఏదన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం సితార ఇలా మరాఠి అమ్మాయిలా రెడీ అయ్యిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆ పిక్ లో సితార అండ్ ఆమె ఫ్రెండ్ మాత్రం ఇలా చీరల గెటప్స్ లో అదుర్స్ అనిపిస్తున్నారు.

Mahesh Babu Daughter Sitara in Marathi Getup:

Sitara Mahesh Marathi Getup Sensation in Social Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs