Advertisement
Google Ads BL

మరీ.. ఇంత సింపుల్ గానా ప్రియమణి..?


టాలీవుడ్ లో సినిమా అవకాశాలు లేక డాన్స్ షోలకి జడ్జ్ గా మారిన హీరోయిన్ ప్రియమణి తన బాయ్ ఫ్రెండ్, వ్యాపారవేత్త ముస్తాఫా రాజ్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ముస్తాఫా రాజ్ తో గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకుంది ప్రియమణి. అయితే ఎంగేజ్మెంట్ అయినా ఏడాది కి ముస్తఫా తో పెళ్ళికి సిద్ధపడిన ఈ భామ, తన పెళ్లిని కొన్ని కారణాల వలన చాలా సింపుల్ గా చేసుకోబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇవ్వడమే కాదు.... బుధవారం (ఆగస్ట్ 23) పెళ్లిని చాలా సింపుల్ గా చేసేసుకుంది. బెంగళూరు శివాజీనగర్ లో ప్రియమణి - ముస్తాఫా లు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ పెళ్ళికి ముందు రోజు అంటే మంగళవారం ప్రియమణి తన సంగీత్ వేడుకని మాత్రం గ్రాండ్ గా జరుపుకుందని తెలుస్తుంది. అయితే ఈ వేడుకకి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు తప్ప బయటివారికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. అయితే పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకున్న ప్రియమణి రిసెప్షన్ ని మాత్రం.. గురువారం గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. 

బెంగళూరులోని కొత్తనూరు దిన్నె మెయిన్ రోడ్ పై ఉన్న ఎలెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ రిసెప్షన్ కి ప్రియమణి బంధువులతోపాటే సెలబ్రిటీస్ కూడా హాజరవుతారని సమాచారం అందుతుంది. ఇక ఈ పెళ్లి తంతు ముగియగానే ప్రియమణి షూటింగ్స్ తోనూ... ఆమె భర్త ముస్తఫా తమ వ్యాపారాలతోను బిజీ కానున్నారు.

Priyamani and boyfriend Mustafa Raj get married:

Priyamani and Mustafa Raj decided to take the big step and got married, and are expected to host a grand reception at a plush hotel in Bengaluru. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs