Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ డిసైడ్‌ అయ్యాడు..!


ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ బాబి దర్శకత్వంలో తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈచిత్రం సెప్టెంబర్‌ 21న విడుదల కానుంది. ఇక షూటింగ్‌, పాటలు, ఇతర గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌, ఆడియో విడుదల, ప్రమోషన్ల వరకు జరుపుకోవడానికి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది. 

Advertisement
CJ Advs

మరోవైపు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వస్తున్న 'బిగ్‌ బాస్‌'షోలో కూడా వారానికి రెండు రోజులు పాల్గొనడం తప్పనిసరి. ఇక ఈచిత్రం కోసం దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడని తెలుస్తోంది. 'జై'కి సంబంధించిన టీజర్‌లో ఎన్టీఆర్‌ నటనతో పాటు దేవిశ్రీప్రసాద్‌ రీరికార్డింగ్‌ కూడా ఎంతో హైలైట్‌ అయింది. ఇక 'లవ కుమార్‌' క్లాస్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ వినాయక చవితి ముందు రోజు రాత్రే విడుదల చేయనున్నారు. 

ఇక 'కుశ' పాత్రకు సంబంధించిన లుక్స్‌, టీజర్లు, ఆడియోవేడుక మిగిలి ఉన్నాయి. మొదట ఈ చిత్రం ఆడియోని ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ల తండ్రి హరికృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 2న జరపాలని భావించారు. ఆ రోజున నందమూరి హరికృష్ణతో పాటు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే అనే విషయం కూడా తెలిసిందే. కానీ తన తండ్రి జన్మదినోత్సవం రోజున ఎన్టీఆర్‌కి 'బిగ్‌బాస్‌' షూటింగ్‌ ఉందంట. 

దాంతో ఈ చిత్రం ఆడియో వేడుకను తదుపరి రోజు ఆంటే సెప్టెంబర్‌ 3న సాయంత్రం అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ 'జై లవ కుశ' చిత్రం ప్రస్తుతం 'కిక్‌2'తో పాటు కొన్ని చిత్రాల వల్ల ఆర్ధిక నష్టాలలో ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌కే గాక ఎన్టీఆర్‌ నటనా విశ్వరూపం చూపించడం కోసం ఆయన పడుతున్న కష్టానికి ఇది ఎన్టీఆర్‌కి కూడా ఎంతో కీలకం కానుంది. 

Jai Lava Kusa Movie Audio Release Update:

Jai Lava Kusa Movie audio launch ceremony will be held in grand manner on 3rd September in Hyderabad.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs