మెగా ఫ్యామిలీలో మనస్పర్దలు ఉన్నాయని, పవన్ మెగా ఫ్యామిలీకి కాస్త అంటి అంటనట్లుగా ఉంటున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీపై పవన్ కినుక వహించాడని అంటున్నారు. అల్లు అర్జున్ మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక అయినా పవన్ అభిమానులు పవన్ పేరుతో మార్మోగిస్తుండటంతో కాస్త కోపంగా పవన్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి చెప్పను బ్రడర్ అనే వ్యాఖ్యలు చేశాడు.
చిరు ఈ విషయంలో మెగాభిమానులను కాస్త శాంత పరచమని బన్నీకి చెప్పినా ఆయన వెనక్కి తగ్గి కనీసం వివరణ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక ఈ వ్యవహారన్ని అల్లు అరవింద్ ఏదో తమాషా చూసినట్లు చూస్తున్నాడు. అల్లు శిరీష్ కూడా పవన్ అభిమానులను హర్ట్ చేస్తూ ఆ మద్య కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక 'డిజె' సందర్బంగా జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ, దిల్‌రాజు, హరీష్ శంకర్‌లు కలసి ఈ చిత్రం మీద నెగటివ్ కామెంట్స్ చేసిన పవన్ అభిమానులను, మీడియాను టార్కెట్ చేసి, ఎదురుదాడి చేశారే తప్ప దీనికి ఫుల్‌స్టాప్‌పెట్టే పని చేయలేదు.
ఇక ఇంత గొడవ జరుగుతున్నా కూడా అల్లు అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకి విహారయాత్రకు వెళ్లాడు. కాగా ఆమద్య ఓసారి అల్లు అర్జున్ కాస్త పుండును రేపుతూ, చిరంజీవి వేసిన దారిలో తాము కార్లు నడుపుతున్నామని, ఆయన పునాదితో తాము ఎదిగామని చెబుతూ, పవన్ కూడా చిరు వల్లే స్టార్ అయ్యాడని ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేశాడు. తాజాగా 'సై..రా' మోషన్ పోస్టర్ ఆవిష్కరణలో అల్లు అరవింద్ తన తెలివి తేటలు చూపించాడు. చిరంజీవి వేసిన తారు రోడ్డుపై పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారందరూ నడుస్తున్నారని చెప్పి, ఆ లిస్ట్‌లో పవన్ పేరును చాకచక్యంగా చేర్చి, పవన్ కూడా మెగాస్టార్ వల్లనే ఎదిగాడని, చిరులేనిదే పవన్ కూడా లేడనే విధంగా అర్ధం వచ్చేలా మాట్లాడాడు.
మొత్తానికి పవన్, బన్నీలు కేవలం మెగాభిమానులనే కాదు.. తమకంటూ సొంత అభిమానులను కూడా ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక పవన్ తన సినిమాల ద్వారా కంటే తన వ్యక్తిత్వం, రాజకీయాల ద్వారా గొప్ప ఫాలోయింగ్‌ని ఏర్పరచుకున్నాడు. కానీ పవన్‌ని కూడా చిరు వేసిన దారిలో నడిచిన వాడిగా అల్లు అరవింద్ చెప్పిన తీరు ఆయనలోని ఉద్దేశ్యాన్ని పట్టిస్తుంది...!