Advertisement
Google Ads BL

అక్కడ సూపర్‌స్టార్‌ రేంజ్‌ అది..!


ఏ హీరోతో చిత్రం చేస్తుంటే ఆ హీరోని పొగడ్తలతో ముంచేయడం, భజన చేయడం మామూలే. యూనిట్‌లోని అందరూ అదే పని చేస్తారు. కానీ మణిరత్నం, శంకర్‌, రాజమౌళి. మురుగదాస్‌ వంటి వారు ఎవరినైనా పొగుడుతూ మాట్లాడారంటే దానికొక విలువ ఉంటుంది. తాజాగా మురుగదాస్‌ తాను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో చేస్తున్న 'స్పైడర్‌' గురించి మాట్లాడుతు, స్పై థ్రిల్లర్‌ చేయాలని భావించినప్పుడు నాకు వెంటనే మహేష్‌ గుర్తుచ్చొడు. 

Advertisement
CJ Advs

ఆయనను 'స్టాలిన్‌' చిత్రం సమయంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరావు పరిచయం చేశాడు. 'స్పైడర్‌'కి కావాల్సిన మాస్‌ ఫాలోయింగ్‌, లుక్స్‌ సరిగ్గా మహేష్‌కే ఉన్నాయి. ఇక ఈచిత్రం కోసం 80రోజులు రాత్రుళ్లు షూటింగ్‌ చేసినా మహేష్‌ ఎంతో సహకరించాడు. ఇక ఈ చిత్రంతో మహేష్‌ తమిళంలో కూడా పెద్ద స్టార్‌ అయిపోవడం ఖాయం. ఈచిత్రం రషెష్‌ చూసినప్పుడు నాకా నమ్మకం కలిగింది. ఇక తమిళంలో మహేష్‌ మాట్లాడిన తీరు ఆశ్చర్యం వేసింది. ఇక ఇటీవలే ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఓ కథ చెప్పాను. 

కమర్షియల్‌ జోనరులోనే ఆ సామాజిక అంశాన్ని ఈ సబ్జెక్ట్‌లో డిస్కస్‌ చేశాం. రజినీ సార్‌ ఎప్పుడంటే నేను అప్పుడు రెడీ అని చెప్పాడు. ఇక మురుగదాస్‌ 'స్పైడర్‌'తో బిజీగా ఉండగా, రజినీ శంకర్‌తో '2.0' పోస్ట్‌ ప్రొడక్షన్‌, 'కాలా' చిత్రాలతో బిజీగ ఉన్నాడు. ఇక మురుగదాస్‌ తన తదుపరి చిత్రం లైకా ప్రొడక్షన్స్‌లో విజయ్‌తోనే తదుపరి చిత్రం చేస్తాడా? లేక అంతకంటే ముందే రజినీ ఓకే అంటే అతనితో వెళ్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత దక్షిణాది చిత్రాలకు, మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాలకు పరిధి బాగా పెరిగింది. హిందీ హక్కులు తీసుకునే వారు థియేటర్లలో రిలీజ్‌ చేస్తారో? చానెళ్లలో వేస్తారో? యూట్యూబ్‌లో పెడతారో? వేరే సంగతి. 

మొత్తానికి 'స్పైడర్‌' హిందీ హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడుపోయాయి. ఇక 'శ్రీమంతుడు' తర్వాత దానయ్య నిర్మాతగా, కొరటాల శివ, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌ హక్కులను ఏకంగా 16కోట్లకు అమ్ముడుపోయాయి. 'సరైనోడు'తో పాటు మహేష్‌ 'ఖలేజా' చిత్రం కూడా అక్కడ యూట్యూబ్‌, చానెల్స్‌లో బాగా ఆదరణ పొందిన నేపథ్యంలోనే 'భరత్‌ అనే నేను'కి ఇంత భారీ రేటు పలికిందని చెప్పాలి. 

AR Murugadoss's Shower of Praises on Mahesh Babu:

AR Murugadoss's revealed many interesting things on his ongoing film 'Spyder' starred by Prince Mahesh Babu.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs