అంతా నాఇష్టం. నాజీవితం నా ఇష్టం అనే ధోరణిలో ఉండే వర్మ మనస్తత్వమే కాదు.. ఆయన తీసే చిత్రాలు కూడా అలాగే ఉంటాయి. ఇక తాజాగా ఈనెల 25న విడుదలకు రెడీ అవుతున్న 'అర్జున్ రెడ్డి' టీజర్లను, ట్రైలర్లను చూస్తే అందులో వర్మ ఇన్‌స్పిరేషన్ ఖచ్చితంగా ఉందని అర్ధమవుతోంది. ఈ చిత్రం దర్శకుడి భావజాలంలో, మూవీ హీరో విజయ్ దేవరకొండ మెంటాలిటీలో కూడా వర్మ స్టైల్ కనిపిస్తుంది.
ఈ హ్యూమానిటినీ ఎఫ్‌తో మొదలయ్యే బూతుతో తిట్టడం నుంచి, తన గర్ల్‌ఫ్రెండ్, సోదరిని ఎవరైనా ఏమైనా అంటే వాడే బూతుని నాడు వేడుకకు హాజరైన యువతరం చేత చెప్పించాడు. కానీ అంత ఉద్రేకం మంచిది కాదని, ఆయన యాటిట్యూట్ సరిగా లేదని తమ్మారెడ్డి భరద్వాజ నుంచి ఎందరో పెద్దలు చెబుతున్నారు. ఏదో ఎమోషనల్‌లో ఆ పదం వాడటం వేరు.. కావాలని తమాషాగానో, కామెడీగానో హాజరైన ఆడియన్స్ ద్వారా పదే పదే ఆ డైలాగ్‌ని రిపీట్ చేయించడం, ప్రసంగంలో ఎఫ్‌తో కూడిన పదాన్ని మరీ మరీ వాడటం, సెన్సార్‌ని టార్గెట్ చేయడం సమంజసంగా లేదు.
సెన్సార్‌వారిపై పోరాడాలంటే దేశస్థాయిలో కలిసి అందరితో పోరాడాలే కానీ ఇది సరైన పద్దతి కాదు. ఇక ఆయన గౌరవనీయులైన వి.హెచ్, హనుమంతరావుని ఆయన వయసుకు, హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా 'చిల్ తాతయ్య' అని సంబోధించడం సంస్కారం కాదు. విహెచ్ బస్సులపై ఉన్న ఈ లిప్‌లాక్ సీన్ పోస్టర్‌ని చించేశాడు. మహిళా సంఘాలు కూడా ఫిర్యాదులు చేశాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండకి వర్మ మద్దతు చెప్పడం చూస్తే ఇదంతా హైప్ కోసం చేస్తున్న పనే అనిపిస్తుంది. నా భావజాలంతోనే విజయ్ ఉన్నాడు. అయినా నేను చనిపోకుండా విజయ్ దేవరకొండ ఎలా పుట్టాడబ్బా? అని వర్మ వ్యాఖ్యనించాడు.
దానికి విజయ్ మీరు పుట్టినప్పుడే నేను పుట్టాను. మీరు 'శివ' చిత్రం తీసిన సంవత్సరంలోనే నేను జన్మించాను అని వ్యాఖ్యానించాడు. విహెచ్ విజయ్ పోస్టర్లని చించేస్తే ఆయన చొక్కాని విజయ్ చింపేయాలని వర్మ మరో వివాదాస్పద కామెంట్ చేశాడు. విజయ్‌లాగానే వర్మ కూడా విహెచ్‌ని తాతయ్య అని సంబోధించాడు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ అదిరిపోతున్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ వివాదాల పుణ్యమా అని 'అర్జున్ రెడ్డి'కి అంచనాలు బాగానేపెరిగాయి. పెద్ద హీరోలను తలదన్నే రీతిలో ఈచిత్రం ప్రీమియర్ షోని ఏకంగా కర్నూల్‌లో గురువారం సాయంత్రం 4.30 నిమిషాలకే వేస్తున్నారు.
టిక్కెట్లు కూడా బాగానే తెగాయి. సినిమా ఫలితం తేడా అయితే మాత్రం విజయ్‌పై విమర్శలు మామూలు స్థాయిలో ఉండవని అర్ధమవుతోంది. ఇక ఈ పోస్టర్‌లో ఉన్నది మంచా? చెడా? అనేది విహెచ్ తన మనవరాళ్లను అడిగి తెలుసుకోవాలని వర్మ మరో సెటైర్ విసిరాడు.