Advertisement
Google Ads BL

చిరుపై వీర ప్రేమ చూపించిందిగా..!


తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. మరోవైపు చిరంజీవి మాత్రం తన ఇంటికి, కుటుంబానికే పరిమితమై, సన్నిహితులను, శ్రేయోభిలాషులను, ఫ్యాన్స్‌ని అక్కడే కలుసుకున్నారు. వారి ద్వారా విషెస్‌ అందుకున్నారు. పలువురు ఆయనకు పలు విధాలుగా శుభాకాంక్షలు చెప్పినా చిరంజీవి సోదరి విజయదుర్గ మాత్రం ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం చిరంజీవి నటించే 'సై...రా..' చిత్రం మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్య్ర యోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ, బ్రిటిష్‌ వారిని ఎదిరించి వారి గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఇండియాలోని పలు భాషల్లో ఈచిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేతిలో కత్తి పట్టుకుని మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇది ఉయ్యాల వాడిన వీరఖడ్గం. దీంతో చిరంజీవికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా, అదే సమయంలో సందర్భోచితంగా చిరంజీవి సోదరి విజయదుర్గ చిరంజీవి కోసం అమృతసర్‌లో ఓ ప్రత్యేక వీరఖడ్గాన్ని తయారు చేయించి బహుమతిగా ఇచ్చింది. 

తన కుమారులైన సాయి ధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌లతో చిరంజీవి ఇంటికి వచ్చిన ఆయన చెల్లెలు తన కుమారులు , తన చేతుల మీదుగా ఈ ఖడ్గాన్ని అందించడం టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. ఓరేంజ్‌కి ఎదిగిన తర్వాత బోకేలు, ఇతర గిఫ్ట్‌లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. దాంతో ఇన్నోవేటివ్‌గా ఆలోచించిన విజయదుర్గ తన అన్నయ్యకు, తన కుమారులు, తన చేతుల మీదుగా ఈ ఖడ్గాన్ని అందించడం విశేషంగా చెప్పాలి. 

Sister Vijaya Durga Gives Superb Gift to Chiru:

Sai Dharam Tej and his mother gave a custom made sword to Chiru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs