తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి 'సై..రా' అనే టైటిల్ పెట్టినప్పటికీ 'సై..రా' అనే పదాన్ని పలకడంలో 'సైరా' అనే మరో మీనింగ్ కూడా వస్తుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో 'ఉయ్యాలవాడ' పేరు లేకపోవడంపై ఆయన వారసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ చిత్రం టైటిల్ 'మగధీర', 'బాహుబలి' టైటిల్స్‌లా క్యాచీగా లేదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరోచితంగా ఉండే వేరై టైటిల్‌ని పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు.
కానీ కొన్ని టైటిల్స్ మొదట్లో అలా అనిపించినా, రోజుల గడిచే కొద్దీ ఆ టైటిలే బాగా క్యాచీగా మారిపోతుంది. ఇక 'రేసుగుర్రం' చిత్రం సమయంలోనే చిరంజీవి తమన్ సంగీతాన్ని తాను బాగా ఇష్టపడతానని త్వరలో ఆయనకు ఓ అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇక సురేందర్‌రెడ్డికి తమన్ ఆస్థాన సంగీత విద్వాంసుడు కావడంతో ఆ కోరిక 'సై...రా'తోనే తీరుతుందని పలువురు భావించారు. కానీ మొదట ఈ చిత్రాన్ని 'బాహుబలి-ది బిగినింగ్' చూసి తెలుగులో తీసి తమిళ్‌లోకి డబ్బింగ్ చేయాలని భావించారు.
కానీ 'బాహుబలి- ది కన్‌క్లూజన్' తర్వాత లెక్కలు మారిపోయి బడ్జెట్ 150కోట్లపైగా చేరి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా భారీ లెవల్‌లో తీయాలని భావించడంతో తమన్ స్థానంలో దిగ్రేట్ ఎ.ఆర్.రహ్మాన్ వచ్చి చేరాడు. అయినా తన తదుపరి చిత్రంలో తమన్‌కి అవకాశం గ్యారంటీ అని చిరు ప్రామిస్ చేశాడట. మరి అది 152వ బోయపాటి - అల్లుఅరవింద్‌ల చిత్రం అవుతుందా? మరోటి అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది.....!
ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్‌లో వెనుక వైపు నుంచి చిరంజీవిని చూపించారు. కానీ ఆ బాడీషేప్‌లు అవి చూస్తే అది చిరంజీవి గెటప్‌లాలేదని, 'రుద్రమదేవి' చిత్రంలో గోనగన్నారెడ్డిగా చేసిన బన్నీ స్టైల్, లుక్‌లా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.