Advertisement
Google Ads BL

'లవ, కుశ'ల పనే అది..తెలుసా?


'జై లవ కుశ' లో ఎన్టీఆర్ మూడు పాత్రలు విభిన్నంగా వుండబోతున్నాయని మనకి 'జై' టీజర్ చూడగానే అర్ధమయ్యింది. 'జై' టీజర్లో ఎన్టీఆర్ విలన్ గా విశ్వరూపం చూపించాడు. రావణాసురుడి భక్తుడిగా, పార్టీని స్థాపించే యువకుడిగా ఎన్టీఆర్ ఈ పాత్రలో కనబడుతున్నాడు. మరి 'లవ' పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కూల్ లుక్ లో కనబడుతున్నాడు. ఇక 'లవ' టీజర్ లో లవకుమార్ గా ఎన్టీఆర్ ఎలా కనబడతాడో అనే దానిమీద ఈ గురువారం సాయంత్రంకి  క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే 'కుశ' పాత్రలో కూడా ఎన్టీఆర్ లుక్ ఎలా వుండబోతుందో కూడా ఈ నెలఖారునే క్లారిటీ ఇచ్చే యోచన చేస్తుంది చిత్ర యూనిట్. 

Advertisement
CJ Advs

అయితే 'జై లవ కుశ' చిత్రంలో కామెడీకి పెద్ద పీట వేశారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. 'జై' పాత్రలోని సీరియస్ తప్పించి సినిమాలోని 75  శాతం పూర్తి కామెడీతో కూడుకుని ఉంటుందని...  ఈ చిత్రానికి పూర్తి బలం కామెడీ కాబట్టే చిత్రం మీద చిత్ర యూనిట్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ 'లవ, కుశ' పాత్రల్లో కావాల్సిన కామెడీ పండించబోతున్నారనే టాక్ వినబడుతుంది. మరి సినిమా విడుదలకు సమయం చాలా తక్కువ ఉండటంతో ఇప్పుడు చిత్ర టీమ్ మూడు పాటల షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులమీద, చిత్ర పబ్లిసిటీ మీద పూర్తి దృష్టి సారించింది.

మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్, మ్యూజిక్ కి మ్యూజిక్ అన్ని విషయాల్లో పూర్తి పర్ఫెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కిందని... ఈ విషయంలో ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ లుక్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో అనే క్యూరియాసిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు.

Jai Lava Kusa Movie Latest Updates:

Jai Takes Action Part, Lava and Kusa taks Comedy part for Jai Lava Kusa 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs