Advertisement
Google Ads BL

ఇంకో తీగ దొరికింది. డొంక కదలాలి..!


టాలీవుడ్ లో మొన్నామధ్యన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో 12  మంది సెలబ్రిటీస్ ని ఈ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారించిన ఘటన పెద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో  ఇలాంటి చీకటి కోణమే మరొకటి బయట పడింది. ఈ ఘటనతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విషయం ఏమిటంటే మసాజ్ సెంటర్స్ పేరుతో కొంతమంది డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారనే కోణంలో పోలీస్ లు దర్యాప్తు చెయ్యగా అందులో నమ్మలేని నిజాలే బయట పడ్డాయి. హైదరాబాద్ లో మసాజ్ సెంటర్స్ నడిపిస్తున్న కొంతమందిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ లు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో  మెయిన్ పిల్లరయిన సిద్ధార్థ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సిద్దార్ధ్ అనే వ్యక్తి మసాజ్ సెంటర్స్ ముసుగులో డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నాడని చెబుతున్నారు. మసాజ్ సెంటర్స్ ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చుకుని కస్టమర్స్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు పోలీసులు సిద్ధార్థ్ నుండి నిజాలు రాబట్టారు. ఇక అతను మసాజ్ సెంటర్స్ లో పనిచేయడానికి థాయిలాండ్ నుండి, అస్సాం నుండి, మిజోరాం నుండి 30 , 40 మంది అమ్మాయిలను తీసుకొచ్చి వారి సాయంతోనే సిద్ధార్థ్ ఇంత పెద్ద డ్రగ్స్ జాకెట్ నడుపుతున్నాడని... అలాగే సిద్దార్ద్ కి పెద్దల సహకారం ఉన్నట్టు పోలీస్ లు చెబుతున్నారు.

అయితే ఈ రాకెట్ లో మరికొన్ని షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. అదేమిటంటే ఈ సిద్ధార్థ్ తో కనెక్షన్ పెట్టుకున్న వాళ్లలో ఇద్దరు సినిమా సెలెబ్రిటీస్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న ఒక నటుడు మరియు సినిమాల్లో వ్యాంప్ కేరెక్టర్స్ లో బాగా పేరు సంపాదించిన ఒక నటి ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక వీరిద్దరూ ఈ మధ్యనే బుల్లితెర మీద ఒక బిగ్ రియాల్టీ షోలో కూడా పాల్గొన్నారనే  విషయం బయటికి వచ్చింది. వీరిద్దరూ ఈ డ్రగ్స్ ని కొంతమంది బుల్లితెర నటులకి అలాగే వెండితెర నటీనటులకు కూడా సప్లై చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ సిద్ధార్థ్ అనబడే వ్యక్తి అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడని.. హైదరాబాద్ లోని అమ్మాయిలను విదేశాలకు తీసుకెళ్లి అక్కడ స్టార్ హోటల్స్ లోని కొంతమంది ప్రత్యేక వ్యక్తుల దగ్గరికి వారిని పంపడం వంటి వాటితోను కూడా అతని వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందని చెబుతున్నారు. పోలీస్ ల రిమాండ్ లో ఉన్న సిద్ధార్థ్ మరికొంతమంది పేర్లు బయట పెట్టే అవకాశమున్నట్లు కూడా తెలుస్తుంది.

Siddharth and Two Celebrities Caught in Drug Scandals :

Siddharth and Two Celebrities supplies Drugs in Massage Centers 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs