Advertisement
Google Ads BL

మహేష్‌ కూతుర్ని దించుతున్నారు!


మహేష్‌బాబు సూపర్‌స్టార్‌ కృష్ణ తనయునిగా, తన అన్నయ్య రమేష్‌బాబుతో కలిసి చిన్ననాడే బాలనటునిగా రాణించాడు. 'నీడ, పోరాటం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం' వంటి చిత్రాలలో నటిస్తూ 'బాలచంద్రుడు'తో బాలనటునిగానే తెరంగేట్రం చేశాడు. ఇక ఫుల్‌ప్లెజ్‌డ్‌ హీరోగా 'రాజకుమారుడు'తో మారాడు. ఇక ఆయన కుమారుడు గౌతమ్‌కృష్ణ కూడా హీరో కావడం ఖాయమని ఆయన అభిమానులు సైతం ఇప్పటికే ఫిక్సయ్యారు. దానికి తగ్గట్లుగా ఆయన కూడా '1' ( నేనొక్కడినే)లో బాలనటునిగా పరిచయం అయ్యాడు. తన మనవడితో కూడా నటించాలని ఉందని సూపర్‌స్టార్‌ కృష్ణ అంటూ ఉంటారు. 

Advertisement
CJ Advs

ఇక గౌతమ్‌కృష్ణ కంటే ఆయన చెల్లి, మహేష్‌బాబు కూతురు చూడటానికి గానీ, చేసే పనుల్లో కానీ చాలా స్పీడ్‌గా ఉంటోంది. తన తండ్రి నటించే చిత్రాలలోని క్యాచీ సాంగ్స్‌ని హమ్‌ చేయడం, డ్యాన్స్‌ చేయడం చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఇంకా స్కూల్‌కి ఎదిగే వయసు కూడా రాని ఈ సితార హైదరాబాద్‌లో చిన్నతనం నుంచే తన డ్యాన్స్‌కి మెరుగులు దిద్దుకోవడానికి సైతం చిన్నవయసులోనే ఒప్పుకుంది. ఆమె తల్లి నమ్రతాశిరోద్కర్‌ కూడా నటే కావడంతో తన కూతురిని కూడా నటిగా చేయాలని ఆశపడుతుందో లేదో తెలియదు గానీ, నటులుగా మారాలని చిన్నప్పటి నుంచే కలలు కనే వారిలాగానే భరత నాట్యంలో చేర్చింది. 

హైదరాబాద్‌లో భరతనాట్యంలో ఎవర్‌గ్రీన్‌ శిక్షణను అందించే అరుణాభిక్షు, ఆమె కూతురు మహతి భిక్షుల దగ్గర ఆమె భరతనాట్యం నేర్చుకోవాలని నిర్ణయించడం నమ్రతా ముందు చూపుకి నిదర్శనం. కేవలం నటిగా కాకపోయినా నాట్యం అనేది ఆడవారికి ఓ ఆభరణం వంటిదని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ బుజ్జి మహేష్‌ నాట్యంలో ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Mahesh Daughter Sithara Natya Arangetram!:

Sithara is seen performing her Pooja ritual at Lord Nataraja before her journey to dance school with her friends.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs