ఓ సినిమాకి సెన్సార్ వారు ఇచ్చే సర్టిఫికేట్‌పై దమ్ముంటే పోరాటం చేయాలి. అలా చేయకుండా తమ 'అర్జున్‌రెడ్డి' చిత్రం సెన్సార్ విషయంలో రాజీ పడి ఏదో మ్యూట్‌లతో బయటపడి, 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాను ఫ్యామిలీ అంతా చూడవచ్చని, సెన్సార్ వారికే మెచ్యురిటీ లేదని, చిన్నపిల్లలకైనా మానసికంగా మెచ్యురిటీ వస్తే ఈ చిత్రం చూడవచ్చని చెప్పడం ఎంతవరకు సమర్దనీయం?
అసలే నేడు మహిళలపై రేప్‌ల విషయంలో మైనర్ అనే పదానికి సరైన నిర్వచనం కోసం పలువురు పట్టుపడుతున్న వేళ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? ఇక ఈ చిత్రం ఓ డ్రగ్ లాంటిదని, అది క్రమంగా మెదడులో కిక్‌నిస్తుందనే పదాన్ని ఎలా వాడుతారు? సెన్సార్‌కి ముందే టీజర్లు, ట్రైలర్లు టీవీ చానెల్స్‌లో ఎలా చూపిస్తారనే దానికి ఈ చిత్ర దర్శకహీరోలు ఇచ్చే సమాధానం ఇంత పచ్చిగా ఉంటే ఎలా?
సమజానికి కొన్నిహద్దులు, పద్దతులు ఉంటాయి. కానీ దానిని కాదని రాత్రిళ్లో భార్యాభర్తలు ఏమి చేస్తారో? నిజంగా చేసే దానినే సినిమాలలో చూపిస్తామని ఏకంగా రతి క్రీడను తెరపై చూపిస్తారా? తన చెల్లిని, తన గార్ల్‌ఫ్రెండ్‌ని ఎవరైనా ఏమైనా అంటే మనం ఓ బూతును వాడుతాం. దానినే సినిమాలో వాడామని కానీ సెన్సార్ వారు దానిని మ్యూట్ చేశారని చెప్పి, ప్రీరిలీజ్ వేడుక నిండా బూతులు మాట్లాడుతూ, ఆడియన్స్‌గా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన స్టూడెంట్స్ చేత ఆ బూతుని అనిపిస్తే ఎలా?
అసలు 'ఎఫ్'తో కూడిన ఇంగ్లీషు బూతు పదాన్ని వాడకూడదన్న విచక్షణ కూడా వదిలేసి, ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్‌రెడ్డిలు అలా రెచ్చిపోవడం, నాటి 'వల్లభ' చిత్రంలో శింబు, నయనతారల లిప్‌లాక్ సీన్‌ని పోస్టర్లలో వేసి పబ్లిసిటీ చేసి చీప్ ట్రిక్స్ చేసిన వారిలా ఈ 'అర్జున్‌రెడ్డి' టీం అలా చేయడం, పోస్టర్లని చించేసిన పెద్ద మనిషి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ హనుమంతరావుని ఉద్దేశించి బూతులు మాట్లాడటం, ఎగతాళి చేయడం ఏమైనా సంస్కారమా?
అప్పుడే హిట్ అయిపోయినట్లు ఊహించుకుని తనను తాను స్టార్‌గా భావిస్తున్న విజయ్ దేవరకొండ హ్యూమానిటీ, గౌరవం ఇవ్వడం, వినయాన్ని కూడా తప్పులు పడుతూ, ఇలా బిహేవ్ చేయడం సమంజసంకాదు. ఇక 3గంటలకు పైగా నిడివి ఉన్న ఈచిత్రం ఏమాత్రం అంచనాలను అందుకుంటుందో చూడాలి? మొత్తానికి ఏదో విధంగా తమ చిత్రానికి పబ్లిసిటీ, ప్రమోషన్ కల్పించడంలో మాత్రం యూనిట్ విజయవంతమైందని ఒప్పుకోవాలి.