Advertisement
Google Ads BL

సరికొత్త భాషతో స్పైడర్ వస్తోంది..!


మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ - రకుల్ జంటగా తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించడమే కాకుండా రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం లో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. 'స్పైడర్' హిందీ శాటిలైట్ రైట్స్ కి షాకింగ్ ప్రైస్ అనే న్యూస్ తప్ప, హిందీ వెర్షన్ గురించి సరైన క్లారిటీ లేదు.  అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మరొక సరికొత్త భాషలో కూడా విడుదల అవుతుంది.

Advertisement
CJ Advs

మహేష్ 'స్పైడర్' చిత్రం తెలుగు, తమిళం, మలయాళంతో పాటే అరబిక్ భాషలో కూడా విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ మురుగదాస్ స్వయంగా తెలిపాడు. అందులో భాగంగానే తెలుగు, తమిళ డబ్బింగ్ తో పాటుగా అరబిక్ భాష డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ఇక 'స్పైడర్' ని గల్ఫ్ కంట్రీస్‌లో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేసి రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారట. అయితే  తెలుగు, తమిళంలో కంటే అరబిక్‌లో అనువాదం చేసి స్ట్రయిట్ రిలీజ్ చేస్తే సూపర్ రెస్పాన్స్ వస్తుందని చిత్ర టీమ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇక తెలుగులో మహేష్ సినిమాలకున్న క్రేజ్ ఏమిటో తెలిసిందే. అలాగే స్ట్రయిట్ తమిళ్ మూవీతో మహేష్ బాబు తమిళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక మహేష్ తమిళ ఎంట్రీకి సంబందించిన ఒక భారీ ఈవెంట్ సెప్టెంబర్ 9 న చెన్నైలో గ్రాండ్ లెవల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తమిళ హీరో భరత్ ఒక విలన్ పాత్రలో నటిస్తుండగా... తమిళ డైరెక్టర్ సూర్య మెయిన్ విలన్ గా అదరకొట్టనున్నాడు.

Mahesh Spyder Release in Arabic Language:

Spyder readying for an Arabic sensation?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs