Advertisement
Google Ads BL

హలో.. చాలా సింపుల్ గా తేల్చేశాడు!


హమ్మయ్య.. ఐదారు నెలల ఉత్కంఠకు అక్కినేని కాంపౌండ్ ఎట్టకేలకు తెర దింపింది. అఖిల్ రెండో సినిమా మొదలైపోయింది.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది కానీ... సినిమాకి సంబందించిన విషయాలేమి తెలియయడంలేదని అక్కినేని ఫాన్స్ తో పాటు మిగతా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే అఖిల్ సెకండ్ మూవీ హీరోయిన్ ఎవరంటూ రకరకాల పేర్లు కూడా చాలా రోజులు సోషల్ మీడియాలో ట్రేడ్ అయ్యాయి. అలాగే అఖిల్ సినిమా టైటిల్స్ అంటూ 'జున్ను, ఎక్కడ ఎక్కడ ఉందొ తారక, రంగులరాట్నం' అంటూ కూడా విపరీతమైన ప్రచారం జరిగింది కూడా. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగ్ నిర్మాతగా తెరకెక్కుతున్న అఖిల్  రెండో సినిమా టైటిల్ ఉత్కంఠకి తెర పడింది.

Advertisement
CJ Advs

నాగార్జున గత రెండుమూడు రోజులుగా సదరు ప్రేక్షకులతో ఆడుతున్న పజిల్ కి కూడా తెరపడింది. ఇప్పటివరకు క్లూ ల మీద క్లూ ఇస్తూ మాంచి.. ఇంట్రెస్ట్ కలిగించిన నాగ్, అఖిల్ రెండో చిత్రానికి 'హలో' అంటూ అధికారికంగా ప్రకటించేశాడు. మరి పెద్ద టైటిల్ తో అఖిల్ వస్తాడనుకుంటే ఇలా 'హలో' అంటూ చాలా సింపుల్ గా వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. మరి అఖిల్ సెకండ్ ఫిలిం టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ తోనూ దిగిపోయాడు. ఆ 'హలో' ఫస్ట్ లుక్ లో అఖిల్ ఒక బిల్డింగ్ అంచున రివర్స్ ఫోజ్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. మరి అఖిల్ ఆ రేంజ్ లో జంప్ కి ప్రయత్నిస్తున్నాడు అంటే గనక ఇదేదో కొత్త కథలాగే కనబడుతుంది.

ఇక విక్రమ్ కుమార్ ఎప్పుడు విభిన్న చిత్రాలతోనే ఆకట్టుకుంటాడు. మరి అఖిల్ తో కూడా అలా ఏదన్నా... కొత్తగా ట్రై చేస్తున్నాడా? అనేది మాత్రం మనకు డిసెంబర్ చివరిలోనే తెలుస్తుంది.

Akhil Second Film Title is Hello:

Akkineni Akhil’s second outing with a romantic subject has finally got its first look and title logo released.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs