గత ఏడాదిలో కాజల్ అగర్వాల్ కి ఒక్క సినిమా అవకాశము లేక కెరీర్ చివరిదశలో ఉన్నట్లు తెగ వార్తలొచ్చాయి. 'జనతా గ్యారేజ్' లో ఐటెం సాంగ్ చేసిన కాజల్ కి ఇక సినిమా అవకాశాలు రావని ఫిక్స్ అయ్యారు జనాలు. అసలు కాజల్ పనైపోయిందని ఏదేదో ప్రచారం జరిగింది. కానీ రామ్ చరణ్ కి ఫ్రెండ్ కావడంతో చిరు పక్కన 'ఖైదీ నెంబర్ 150' లో ఛాన్స్ కొట్టేసి మళ్ళీ కెరీర్ ని చక్కదిద్దేసుకుంది. తెలుగు, తమిళంలో ఒక్కసారిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక తెలుగులో తన మొదటి డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో రానా కి జోడిగా 'నేనే రాజు నేనే మంత్రి'లో చీరకట్టులో కనిపించి అలరించింది. నేనే రాజు లో కాజల్ చీర కట్టు స్టైల్ కి అందరూ ఫాన్స్ అయిపోతున్నారు. రాధగా కాజల్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. చీరకట్టు, పెద్దబొట్టుతో ఎంతో సంప్రదాయమైన అమ్మాయి లుక్స్ లో ఇరగేసిన కాజల్ తమిళ డబ్బింగ్ 'వివేగం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తమిళంలో అజిత్ 25 మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వివేకం’ ఒకేసారి తెలుగు, తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోనూ కాజల్, అజిత్ కి జోడిగా చీరకట్టులోనే ఆకట్టుకోనుంది. ఎంతో అందంగా అజిత్ సరసన కనిపిస్తున్న కాజల్ కి ఈ చిత్రం కూడా హిట్ అయ్యేలాగే కనబడుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించాడనే విషయం 'వివేగం' థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఈ చిత్రం వచ్చే గురువారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే కాజల్ తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఎమ్మెల్యే' లోను, తమిళంలో విజయేంద్ర ప్రసాద్ కథతో విజయ్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ‘మెర్సల్’ మూవీలోనూ కాజల్ ఒక హీరోయిన్ గా నటిస్తూ బిజీగా వుంది. మరో బాలీవుడ్ ఆఫర్ కూడా కాజల్ చేతికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. 'యమ్లా పగ్లా దివానా ఫిర్ సే’లో కాజల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ దెబ్బకి కాజల్ డైరీ దాదాపు రెండేళ్లు ఖాళీ లేకుండా ఫిల్ చేసేసిందన్నమాట.