Advertisement
Google Ads BL

మరో 'తొలిప్రేమ'..హింట్ ఇచ్చాడు..!


పవన్‌కళ్యాణ్‌కి తన చిత్రం 'తొలిప్రేమ'తో పెద్ద హిట్‌ ఇచ్చి ఆయన్ను యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, లేడీస్‌కి బాగా దగ్గర చేసింది కరుణాకరనే. కాగా ఆయన ప్రస్తుతం కెరీర్‌పరంగా ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కె.యస్‌.రామారావు నిర్మాగా, తన పెద్ద మావయ్య చిరంజీవి మెగాస్టార్‌ కావడంలో ఎంతో తోడ్పడిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో చిత్రం చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం గురించి చెప్పాలంటే కరుణాకరన్‌కి 'తొలిప్రేమ' తర్వాత అంతటి హిట్‌ మరలా రాలేదు. ఆయన తీసిన 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా' చిత్రం బాగా ఆడింది. ఇక నితిన్‌తో చేసిన 'చిన్నదానా నీ కోసం' తర్వాత ఆయన మరలాచిత్రం చేయలేదు. దానికి ముందు రామ్‌తో చేసిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం సరిగా ఆడలేదు. ఈరెండు చిత్రాల తర్వాత ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌తో చేస్తున్న సబ్జెక్ట్‌ని రామ్‌, స్రవంతి రవికిషోర్‌లు విని కూడా వదిలేశారు. ఇప్పుడు ఆయన అదే కథను కె.యస్‌.రామారావుతో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా చేయనుండటం విశేషం. 

ఇక ఈ చిత్రంలో కేవలం లవ్‌ మాత్రమే కాకుండా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌వంటి వన్నీ ఉంటాయని కరుణాకరన్‌ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రం మొత్తం మీద చెప్పాల్సి వస్తే తాను తీసిన 'తొలిప్రేమ'కి కొనసాగింపుగా ఈ నూతన చిత్రం ఉంటుందని కరుణాకరన్‌ హింట్‌ ఇచ్చాడు. మరి ఈ చిత్రం కూడా ఆ లెవల్లో తేజూకి హిట్‌ ఇస్తుందో లేదో చూడాలి.. ఇక తేజు ప్రస్తుతం రచయిత బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో 'జవాన్‌' చిత్రం చేస్తున్నాడు. రీషూట్‌ జరుపుకోవాల్సి ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యమవుతుందని అంటున్నారు. 

Pawan Tholiprema sequel with Sai Dharam Tej:

Karanakaran Hints, Teju film is Another Tholiprema 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs