Advertisement
Google Ads BL

తాతయ్యా..కాస్త చల్లబడు..!


విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం రాబోయే శుక్రవారమే విడుదల కాబోతుంది.  A సర్టిఫికెట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఆ పబ్లిసిటీలో భాగంగా 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి సిటీలో అన్ని చోట్ల పెట్టడమే కాకుండా.... హైదరాబాద్ లోని సిటీ బస్సెస్ మీద కూడా పోస్టర్స్ ని అంటించి ప్రచారాన్ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. అయితే బస్సు ల మీద అంటించిన 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ మీద హీరో హీరోయిన్ ల లిప్ లాక్ కిస్ పెట్టుకునే పోస్టర్స్ ఉండడంతో..... అవి చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు కి కోపం వచ్చి బస్సు మీదున్న ఆ పోస్టర్స్ ని చించిపడేసి తనకోపాన్ని తీర్చుకున్నారు.

Advertisement
CJ Advs

అలాంటి సినిమా పోస్టర్స్ వల్లనే కుర్రకారు చెడిపోతున్నారని.... అలాంటి పోస్టర్స్ ని గవర్నమెంట్ బస్సు ల మీద ప్రచురించడానికి ఎంత ధైర్యం అంటూ విరుచుకుపడ్డారు. మరి బస్సు మీదున్న పోస్టర్ ని హనుమంతు రావు గారు చింపగానే అది కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడమే కాదు,  ఈ విషయం ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్లగా... ఆ విషయంపై కూల్ గా స్పందించిన విజయ్  దేవరకొండ హనుమంత రావు ని ఉద్దేశించి 'తాతయ్య కొంచెం చల్లబడు' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

మరి హనుమంతురావు గారు అలా సిటీ బస్సు మీద పోస్టర్ చించడం దానికి విజయ్ కౌంటర్ ఇవ్వడం చూస్తుంటే 'అర్జున్ రెడ్డి'కి ఫ్రీ గా పబ్లిసిటీ వచ్చేసినట్లు అనిపిస్తుంది కదా..!.

Devarakonda Pokes Fun At VHR:

<span>Arjun Reddy replied - Chill Thathayya. Well, age wise VHR is a grand father figure but Chill added before Thathayya directly poked fun, a daring reply indeed.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs