Advertisement
Google Ads BL

అమ్మో.. బాలయ్య దున్నేస్తున్నాడు..!


బాలకృష్ణ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం రికార్డు టైం లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్దమయ్యింది. పూరి స్పీడు, బాలయ్య ఎనర్జీ కలిసి ఈ సినిమాను చాలా తక్కువ టైం లోనే ఫినిష్ చేశారు. ఇప్పటికే విడుదలైన 'పైసా వసూల్' స్టంపర్, థియేట్రికల్ ట్రైలర్ లు యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. బాలకృష్ణ ఎనర్జీకి నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారంటే నమ్మండి. అలాగే 'పైసా వసూల్' సాంగ్స్ లో కూడా బాలయ్య డాన్స్ ఇరగదియ్యడమే కాదు ఒక పాట కూడా వేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక 'పైసా వసూల్' షూటింగ్ కంప్లీట్ కాకముందే ఆగష్టు మొదటి వారంలోనే రవికుమార్ డైరెక్షన్ లో మరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లిన బాలకృష్ణ.... ఆ సినిమా ప్రారంభమైనప్పటి నుండే షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ లో బాలకృష్ణ పై ఈరోజు అంటే సోమవారం హెవీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని.... అలాగే ఈ సన్నివేశాల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొననున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని కూడా రికార్డు టైం లోనే షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికల్లా  విడుదల చెయ్యాలని డైరెక్టర్ రవికుమార్, హీరో బాలకృష్ణ లు ప్లాన్ చేస్తున్నారు.

ఇక 'సింహ, శ్రీరామరాజ్యం' వంటి హిట్ చిత్రాలలో బాలకృష్ణ కి జోడిగా నటించిన హీరోయిన్ నయనతార కూడా ఈ చిత్ర షూటింగ్  లో ఈ రోజు సోమవారమే పాల్గొనబోతుంది. మరి రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి బాలయ్య - నయనతార కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని బాలయ్య అభిమానులు ఎంతగానో నమ్ముతున్నారు . ఇకపోతే ఈ చిత్రానికి కథ ఎం రత్నం అందిస్తుండగా... చిరంతన్ భట్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా సి కళ్యాణ్ వ్యవహరించనున్నాడు.

Balayya Joins his 102 Film Shooting:

<span>Nandamuri Balakrishna is continuing the winning touch for his 102nd film #NBK102 in KS Ravikumar direction by roping in Nayantara as heroine.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs