రాజకీయాలలోకి వెళ్లి దాదాపు హీరోగా దశాబ్దం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ నటించిన రీఎంట్రీ మూవీ, ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మాట వాస్తవం. పెరిగిన వయస్సు దృష్ట్యా తనదైన మార్క్‌తో నెంబర్‌వన్‌స్థాయి చేరిన చిరంజీవి కెరీర్‌లో ఎంతో ఎదుగుదలకు ఉపయోగపడిన డ్యాన్స్‌లు, ఫైట్స్‌లతో ఎలా మరిపించనున్నాడు? రాజకీయాలలో ఓడిపోయి కొందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి మరల సినిమాల ద్వారా తానే టాప్ అని నిరూపించుకుంటాడా? అనే అనుమానాలకు చెక్ చెబుతూ, తనదైన హుషారు నటన, తాగుడు సీన్స్, స్టెప్పులలో, యాక్షన్ సీన్స్‌లో తన గ్రేస్ చెక్కుచెదరలేదని తన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో నిరూపించాడు.
ఇక ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఫ్యామిలీ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయమై ఇటీవల చిరంజీవి కోడలు, ఆయన ఒక్కగానొక కుమారుడైన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన స్పందించారు. ఈచిత్రం విడుదలైన తర్వాత మామగారిని తిరిగి స్క్రీన్‌పై చూసినప్పుడు అందరం ఎంతో ఎగ్జైట్ అయ్యాం. సినిమా చూసి మా కళ్ల వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక మావయ్యగారు ఓ మాస్టర్. ఎంతకాలం తర్వాత అయినా ఆయనకి తిరుగేలేదని నాకు తెలుసు.
కానీ ఇంత క్రూషియల్ సినిమాను మొదటిసారిగా నిర్మిస్తున్న నా భర్త రామ్‌చరణ్ గురించే నా టెన్షన్ అంతా. ఒకవైపు తాను హీరోగా చేస్తూ, మరో వైపు మా మామగారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని తొలిసారి హ్యాండిల్ చేసిన నా భర్త విషయంలో మాత్రం టెన్షన్ పడ్డాను. కానీ ఆయన కష్టానికి తగ్గ ఫలితం లభించింది.. అని ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది మెగాకోడలు ఉపాసన.