Advertisement
Google Ads BL

'జయ జానకి నాయక' థియేటర్స్ పెరిగాయ్!


ఆగస్ట్ 11న విడుదలైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌, జగపతిబాబు, శరత్‌కుమార్‌లు నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం రెండో వారంలో కూడా మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ప్రత్యర్ధులుగా నితిన్‌, రానా దగ్గుబాటి వంటి వారు ఉన్నా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో బోయపాటి చేసిన మ్యాజిక్‌ బాగా వర్కౌట్‌ అయింది. ఈచిత్రం రోజులు గడిచే కొద్ది మరింతగా వసూళ్లను పెంచుకుంటోంది. చిన్నగా మాస్‌ ప్రేక్షకులనే కాదు.. ఫ్యామిలీ, యూత్‌ ఆడియన్స్‌ని కూడా బాగా ఆకట్టుకుంటోంది. 

Advertisement
CJ Advs

తాజాగా తెలంగాణ, ఆంధ్రాలలోని ముఖ్యమైన మాస్‌ సెంటర్స్‌తో పాటు పలు ప్రదేశాలలో ఈ చిత్రానికి సంబంధించి ఏకంగా 100 థియేటర్లను పెంచారు. ఇక ఈచిత్రంలోని యాక్షన్‌ సీన్సేకాదు.. సాయి శ్రీనివాస్‌-రకుల్‌ప్రీత్‌సింగ్‌కి మద్య వచ్చే రొమాన్స్‌ సన్నివేశాలు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌తోపాటు హంసల దీవిలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం మరో వారం రోజుల్లో 30కోట్లను దాటినా ఆశ్చర్యంలేదని, తన చిత్రం 30 నుంచి 35 కోట్ల వరకు వసూలు చేసినా ఆశ్యర్యం లేదని ఆడియో వేడుక సందర్భంగా బోయపాటి శ్రీను చెప్పిన మాటలు నిజమవుతున్నాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని కొన్న వారందరూ ప్రస్తుతం సేఫ్ జోన్‌లోనే ఉన్నారని, ఏవిధంగా చూసుకున్నా కూడా చిత్ర హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి పెద్ద హిట్‌ అనే చెబుతున్నారు. 

ఆయన నటనపరంగా కూడా బాగా నటించాడని, ఆయనలోని టాలెంట్‌ని బయటకి తీసిన ప్రతిభ బోయపాటిదే అంటున్నారు. ఇదే వరుసలో ఈ హీరోకి మరో రెండు మూడు చిత్రాలు పడితే కమర్షియల్‌ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకోవడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా ఇదంతా బోయపాటి శ్రీను మ్యాజిక్కేనని ఘంటాపథంగా చెప్పవచ్చు.

100 Theaters Increased to Jaya Janaki Nayaka:

Audience Connected with Jaya Janaki Nayaka 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs