Advertisement
Google Ads BL

'వివేగం' ని బాహుబలితో పోల్చేశాడు!


వచ్చేవారం అంటే ఈనెల 24న తమిళస్టార్‌ తలా అజిత్‌ నటిస్తోన్న 'వివేగం' చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే తన కెరీర్‌లో 25ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో అజిత్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తన 25ఏళ్ల కెరీర్‌లోనే అజిత్‌ చేస్తున్న అతి భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటికే 'వీరం, వేదాళం' వంటి బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన దర్శకుడు శివ- అజిత్‌లు నటిస్తున్న హ్యాట్రిక్‌ చిత్రంగా కూడా ఈ చిత్రం రానుండటం విశేషం. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో నేరస్తుల కోసం దేశవిదేశాలలో జరిగే ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా అజిత్‌ నటిస్తుండగా, కీలకమైన పాత్రతో కమల్‌హాసన్‌ చిన్నకుమార్తె అక్షరహాసన్‌ నటిగా తన మాతృభాషల్లో నటిస్తోంది. కాజల్ హీరోయిన్. ఇక ఈ చిత్రం ఓ హాలీవుడ్‌ చిత్రం రేంజ్‌లో, హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌, క్రైమ్‌ చిత్రాల స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈచిత్రం గురించి ఎడిటర్‌ ఆంటోని ఎల్‌ రూబెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాకు పూర్తయిన తర్వాత తొలి ప్రేక్షకులు ఆ ఎడిటరే కావడంతో ఆయన మాటలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. 

ఈ చిత్రం మేకింగ్‌పరంగా, స్ఫెషల్‌ ఎఫెక్ట్జ్‌, ఇతర మేకింగ్‌, స్టైల్‌ విషయాలలో రాజమౌళి 'బాహుబలి'ని పోలి ఉంటుంది. ఈ చిత్రంలోని విజువల్స్‌ అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఈ చిత్రం కేవలం అజిత్‌ అభిమానులను, యాక్షన్‌ చిత్రాల ప్రియులనే కాదు.. ప్రతి వర్గం ప్రేక్షకుడికి ఎంతో నచ్చుతుంది. ఈ చిత్రం చూస్తుంటే అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయగా తన నటనతో అజిత్‌ సార్‌ అరిపించేశాడు.. అని చెప్పుకొచ్చాడు. 

చారిత్రక చిత్రం తరహాలో ఉండే 'బాహుబలి'కి సోషల్‌ సబ్జెక్ట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న 'వివేగం'కి పోలికే లేకపోయినా ఆ స్థాయి స్టాండర్డ్స్‌ ఉన్న చిత్రంగా 'వివేగం'పై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. 

Antony L Ruben Sensational Comments on Vivegam:

Vivegam is on par with Baahubali in technical aspects: Antony L Ruben
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs