తాజాగా నంద్యాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య ఓ వీరాభిమాని మీద చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య ప్రచార వైఖరి వల్ల మేలు జరగకపోగా, నష్టం ఖాయమని టిడిపి నాయకులు భావించారు. దాంతో ఆయనను ప్రచారానికి దూరంగా పెట్టారు. ఎలాగూ పక్కరోజు ఆయనకు ఖమ్మంలో తన సినిమా 'పైసావసూల్' బహిరంగ వేదిక కూడా కలిసి రావడంతో మూడు రోజులని భావించిన బాలయ్యను కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం చేశారు.
ఇప్పుడు తాజాగా మరో సంఘటన బాలయ్యని చిక్కుల్లో పడేసింది. ఓ బాధ్యతాయుతమైన శాసన సభ్యుడు అయి ఉండి, సీఎంకి వియ్యంకుడిగా, బావగా, మరో మంత్రి లోకేష్‌బాబుకు మామ అయిన బాలయ్య ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతుండగా, రోడ్‌షోకి వచ్చిన వారికి బాలయ్య వాహనం మీద నుంచి డబ్బులు పంచాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. ఒకవైపు జగన్ వైసీపీ కోట్లు పంచుతోందని విమర్శలు చేస్తూ, మరోపక్క డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా వీడియో ద్వారా వైరల్ అయిన బాలయ్యపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
ఈ సంఘటనపై పూర్తి వివరాలను తెలపాలని ఆ జిల్లా కలెక్టర్‌ని కోరింది. దీంతో టిడిపికి, నాయకులకు ఈసీ షాక్ వల్ల బాలయ్య తల నొప్పులు తెచ్చిపెట్టినట్లే అయింది. ఇక తాజాగా రోజా నంద్యాలలో ఫ్యాన్ గుర్తు స్పీడ్‌కి బాలయ్య విగ్ ఎగిరిపోయిందని, ఆయన ఎటు వెళ్లాడో తెలియదని చేసిన వ్యాఖ్యలతో పాటు జగన్ సీఎం పట్ల దుర్భాలాషలాడుతున్నాడనే సింపతి కూడా తెలిసి బాలయ్య వ్యాఖ్యలతో పోయిందని అంటున్నారు.