Advertisement
Google Ads BL

నాని జోరు మాములుగా లేదుగా..!


రెండు హ్యాట్రిక్‌లు పూర్తి చేసి 'నిన్నుకోరి'తో ట్రిబుల్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాడు యంగ్‌ నేచురల్‌స్టార్‌ నాని. ఇక ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా 'నేను లోకల్‌' తర్వాత వేణుశ్రీరాం దర్శకత్వంలో 'ఎంసీఏ' చిత్రం చేస్తున్నాడు. ఇందులో 'ఫిదా' ఫేమ్‌ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తూ ఉండటంతో ఈచిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌. ఎక్స్‌ప్రెస్‌ రాజా'లతో రెండు వరుస హిట్స్‌ అందుకున్న మేర్లపాక గాంధీతో 'కృష్ణార్జున యుద్దం' చేస్తున్నాడు. దీని తర్వాత తనతో 'కృష్ణగాడి వీరప్రేమగాధ' తీసి, నితిన్‌లో 'లై' తరహా ప్రయోగాత్మక చిత్రం చేసిన హను రాఘవపూడితో మరో చిత్రం చేయనున్నాడు. 

Advertisement
CJ Advs

ఇంకా శ్రీనివాస్‌ అవసరాల, ఇంద్రగంటి మోహనకృష్ణతో పాటు పలువురు దర్శకులు లైన్లో ఉన్నారు. తాజాగా నాని ది లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. నిజానికి నాని మణిరత్నం తీసిన 'ఓకే బంగారం' చిత్రంలో తెలుగులో హీరో దుల్కర్‌సల్మాన్‌కి డబ్బింగ్‌ చెప్పాడు. ఆ సమయంలోనే మణిరత్నం గారి సినిమాలో హీరోగా నటించడం తన కోరిక అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా మణిరత్నం ఓ చిత్రంలో మొదటగా నానిని అనుకున్నారు. నాడు ఆ ప్రాజెక్ట్‌ వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. 

ఇక ప్రతి నటునికి మణిరత్నంతో చిత్రం చేయాలనేది ఓ కలే. కానీ ప్రస్తుతం మణిరత్నం పరిస్థితి బాగోలేదు. మరి నాని తన శాటిస్‌ఫ్యాక్షన్‌ కోసం మణి చిత్రంలో నటిస్తాడా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది. మొత్తానికి నాని జోరు చూస్తుంటే మామూలుగా లేదని చెప్పవచ్చు. ఆయన స్ధానం కైవసం చేసుకోవడం నేటి యంగ్‌ తరం హీరోలకు అసాధ్యమేనని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Hero Nani Movie with Maniratnam :

Hero Nani Next Movies Directors List 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs