Advertisement
Google Ads BL

'ఒక్కడుమిగిలాడు' ఇంట్రస్టింగ్ గా వుంది!


ఎవరెన్ని చెప్పినా, తన సోదరుడు మంచువిష్ణుకి ఉన్న సక్సెస్‌లు ఆయన సోదరుడు మంచు మనోజ్‌కి లేకపోయినా నటనా, డైలాగ్‌ డెలివరీ, వినూత్నమైన చిత్రాల ద్వారా తనలోని నటుడిని నిరూపించుకోవాలని భావించడంలో మంచు మనోజ్‌ ముందుంటాడు. అలాగే ఆయన చేసిన 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా', 'నేను ఎవరో తెలుసా' వంటి చిత్రాలు ఆయన అభిరుచిని పట్టిస్తాయి. 

Advertisement
CJ Advs

ఇక సెప్టెంబర్‌ 8న విడుదలకు సిద్దమవుతోన్న 'ఒక్కడుమిగిలాడు' చిత్రం పోస్టర్ల నుంచి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎల్టీటీటీఈ నాయకుడు కెప్టెన్‌ ప్రభాకరన్‌ తరహా పాత్రను, ఓ విద్యార్ధి నాయకుడి పాత్రలో మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి ఈ రెండు పాత్రలకి లింకేమిటి అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ ద్వారా..నేడు సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌ వంటి నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడితే వారిని స్వాతంత్య్రయోధులు అందమా? లేక తీవ్రవాదులగా భావిద్దామా? అనే ఆసక్తికర పాయింట్‌ని డిస్కస్‌ చేయనున్నారని అర్ధమవుతోంది. మరోవైపు దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కూడా మనోజ్‌ దృష్టిపెట్టాడు. స్త్రీల హక్కుల కోసం కూడా ఈ చిత్రంలో ఆయన కదం తొక్కనున్నాడని తెలుస్తోంది. 

మొత్తానికి దర్శకుడు అజయ్‌ అండ్రూస్‌ ఈ చిత్రంతో పలు సమస్యలపై చర్చింనున్నాడని అర్దమవుతోంది. కానీ ట్రైలర్‌లోని విజువల్‌ ఎఫెక్ట్స్‌మాత్రం సరిగాలేవు. ఇక ఈ చిత్రంలో వలస దారులు సముద్రంలో మునిగిపోయే సన్నివేశాలు ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌ ఖానున్నాయని అంటున్నారు. మొత్తానికి నేటి ప్రేక్షకులు వైవిధ్యభరితమైన చిత్రాలను ఆదరిస్తున్న సమయంలో ఈచిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Click Here to See the Okkadu Migiladu Trailer

Okkadu Migiladu Trailer Talk:

Manchu Manoj Okkadu Migiladu Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs