Advertisement
Google Ads BL

చరణ్‌ పై అభిమానంకి హద్దే లేదు..!


చరణ్‌ నటునిగానే కాదు.. వ్యక్తిత్వం పరంగా కూడా ఎదుగుతున్నాడు.నాడు తన 'మగధీర' డైలాగ్‌లతో అదరగొట్టిన 'బుల్లిదీర'ని చేరదీశాడు కానీ దురదృష్టవశాత్తు ఆ బాలుడు మరణించాడు. ఇక గోదావరి సమీపంలో తన 'రంగస్థలం 1985' షూటింగ్‌ సందర్భంగా ఓ బాలుడు గుండె వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి ఆ బాలుడిని ఆదుకున్నాడు. ఇక తాజాగా అస్సోంలో వరదలు వచ్చినప్పుడు కూడా తన భార్య ఉపాసనతో కలిసి విరాళం అందించి తలా చేయి వేయమని చెప్పాడు. ఇక అపోలో ఫౌండేషన్‌ ద్వారా ఉపాసన చేత పలు మంచి కార్యక్రమాలు చేయిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఆయన హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలలో తన 'రంగస్థలం 1985' షూటింగ్‌ జరుగుతుండగా దీపిక అనే ఓ దివ్యాంగురాలు ఆయన మీద అభిమానంతో ఆయనను కలవాలని కోరుకుని అంత దూరం ఆయన్ను చూడటానికి వెళ్లింది. చరణ్ కూడా షూటింగ్‌ బిజీలో ఎంతో హడావుడి ఉన్నా కూడా ఆమెతో మాట్లాడి, ఆమె కోసం సమయం కేటాయించి, ఆమెతో ఫొటోలు తిగడమే కాదు.. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఇక తన సన్నిహితులకు చెప్పి ఆమెను జాగ్రత్తగా హైదరాబాద్‌లో దింపాలని సూచించాడు. దీంతో ఆ యువతి ఎంతో ఆనందానికి గురైంది. 

అయినా అమాయకంగా అభిమానించే అభిమానులు తమ హీరో నుంచి కనీసం ఈ పాటి గౌరవాన్ని అయినా ఆశిస్తారు. అందులో తప్పులేదు. వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆయా హీరోలపై ఉంది అనేది మాత్రం నిజం....! కాగా సంక్రాంతికి విడుదల కానున్న 'రంగస్థలం 1985' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బిజీగా జరుగుతోంది. 

Ram Charan Meets His Handicapped Female Fan:

Charan has got some special guest recently and her name is Deepika a handicapped lady fan of Ram Charan.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs