Advertisement
Google Ads BL

తాప్సీ ఇలా చేయడానికి పెద్ద రిజనే వుంది!


'ఆనందో బ్రహ్మ' చిత్రం ఈ శుక్రవారమే విడుదలై మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ తాప్సి నటించింది అంటూ ప్రచారం జరిగినట్టుగా... 'ఆనందో బ్రహ్మ'లో అసలు తాప్సి రోల్ అంటూ ఏం లేదు కూడా. కానీ తాప్సి మాత్రం తానే సినిమాలో మెయిన్ అన్నట్టు ప్రచారం చేసింది. 'ఆనందో బ్రహ్మ' కోసం తాప్సి ఛానల్స్ కి, వెబ్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లు మాత్రమే కాదు స్టార్ మా లో ప్రచారమవుతున్న 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్ళి మరి 'ఆనందో బ్రహ్మ'కి పబ్లిసిటీ చేసింది.

Advertisement
CJ Advs

మరి ఒక సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటించిన హీరోయిన్ కూడా ఇంతలా ఆ సినిమా కోసం ఇప్పటివరకు ప్రచారం చేసుండదేమో అనేలా తాప్సి ఈ 'ఆనందో బ్రహ్మ' చిత్ర పబ్లిసిటీని భుజాన మోసింది. మరి ఈ సినిమా హిట్ అయితే గనక తను మళ్లీ సౌత్ లో బిజీ అవ్వొచ్చనే ఆలోచనతో చేసింది అంటే అదికాదు.  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుండి సినిమా విడుదలయ్యే వరకు చాలా పబ్లిసిటీ చేసిన తాప్సి ఇంతగా ఆ సినిమా కోసం కష్టపడడానికి ఆమె అందులో నటించిన పాత్రని హైలెట్ చెయ్యడం కోసం కాదట. 

అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ విషయంపై..... అంటే తాప్సి ఈ సినిమాకి చేసిన పబ్లిసిటీ పై ఎడతెగని చర్చ జరగగా అందులో తెలిసింది ఏమిటంటే.... 'ఆనందో బ్రహ్మ' సినిమాకు సంబంధించి తాప్సీకి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో కూడా వాటా వుండే విధంగా ఒప్పందం చేసుకోవడం వలెనే తాప్సి ఇంతిలా కష్టపడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చాలా తక్కువ బడ్జెట్ అంటే మూడు కోట్ల బడ్జెట్ తో మాత్రమే ఈ సినిమాని తెరకెక్కించారు మేకర్స్.

అలాగే నిర్మాతలు సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ తప్ప మిగిలిన ఏరియాలు యువి క్రియేషన్స్, దిల్ రాజు సాయంతో నేరుగా విడుదల చేసుకున్నారు. మరి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిన్న సినిమాను బాగానే ప్రొజెక్ట్ చేసుకుని.....మంచి లాభాలే జేబులో వేసుకునేలా వున్నారు నిర్మాతలు. ఇక ఈ 'ఆనందో బ్రహ్మ' శాటిలైట్ కూడా ఇంకా పూర్తి కాలేదు. అలాగే ఈ సినిమాకి  మా టీవీ నుంచి మంచి ఆఫర్ ఉందనే టాక్ కూడా వినబడుతుంది.

Reason Behind the Anando Brahma Taapsee Promotion:

Taapsee One of the Producer for the Movie Anando Brahma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs