Advertisement
Google Ads BL

సమంతకి కొద్దిసేపైనా అది చేయాల్సిందేనంట!


టాలీవుడ్ లో, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో లవ్ లో పడి మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలెక్కబోతుంది. అయితే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సినిమాల్లో దూసుకుపోతుంది. సినిమాల్లో ఎంత బిజీగా వున్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటూ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాకుండా సమంత ఫిట్ నెస్ విషయంలో కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Advertisement
CJ Advs

ఖాళీ సమయాల్లో ఎక్కువగా జిమ్ముల్లోనే గడుపుతూ బాడీ ఫిట్ నెస్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తుంది. అలాగే తాను జిమ్ లో ట్రైనింగ్  అవుతున్న ఫొటోస్ ని వీడియోస్ ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకి చేరవేస్తూ ఉంటుంది. మొన్న మధ్యన సమంత, నాగ చైతన్యలు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వీడియోస్ ని పోస్ట్ చేసిన సమంత ఇప్పుడు కూడా తాజాగా తన కొవ్వు కరిగించుకోవడానికి జిమ్ లో ఎంతో కష్టపడుతున్న ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ జిమ్ లో సమంత క్యాలరీస్ ని కరిగించుకోవడానికి బంతితో చేస్తున్న వరౌట్స్ కొంచెం కొత్తగా కనబడుతుంది. 

సింగిల్ హ్యాండ్ తో బంతితో ఎంతో ఆసక్తికరంగా పుషప్స్ చేస్తూ నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది సామ్. పెళ్లి దగ్గర పడడం, షూటింగ్స్ తో బాగా బిజీగా ఉన్నప్పటికీ రోజులో కొద్దిసేపైనా కంపల్సరీ జిమ్ చెయ్యాల్సిందే అంటుంది. ఇక సమంత - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న రంగస్థలం షూటింగ్ జోరుగా సాగుతుంది. అలాగే రాజుగారి గది 2  షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. ఇక మహానటి షూటింగ్ మాత్రం ఎక్కువగా బ్యాలెన్స్ ఉంచిన సామ్ తమిళం లో కూడా ఇద్దరు స్టార్ హీరోల పక్కన మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ బిజీగా వుంది.

Samantha Fitness Video Hulchal in Social Media:

Samantha Doing Workouts for Fitness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs