'ఫిదా' చిత్రం విడుదలైన తర్వాత.. కొత్త చిత్రాలు అనేకం రిలీజ్ అయ్యాయి. కానీ 'ఫిదా'లోని భాన్సువాడ భానుమతిని మాత్రం మన ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇప్పటికీ వారి మద్య కామన్‌గా వచ్చే టాపిక్స్‌లో ఒకటి సాయిపల్లవి గురించే. ఇప్పటికే మల్లార్ టీచర్‌గా మాలీవుడ్‌ని దెబ్బకొట్టిన ఈమె హవా టాలీవుడ్‌లో కూడా పెరిగిపోయింది. ఇక ఈ అమ్మడు తాజాగా నాగశౌర్య హీరోగా చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి నాగశౌర్య కన్నా సాయిపల్లవే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ చిత్రం రిలీజ్ డేట్ మీద క్లూ ఇస్తే చాలు ఈ సాయిపల్లవి వల్ల బిజినెస్ అయిపోవడం ఖాయం. సరే తనకేదోలా హిట్ వస్తే అదే చాలని నాగశౌర్య కూడా ఉన్నాడు.
ఇక ఈ అమ్మడు మరోసారి దిల్‌రాజు నిర్మాతగా నేచురల్ స్టార్ నాని హీరోగా వేణుశ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎంసీఏ' చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం 'నేను లోకల్'ని మించి పోవడం ఖాయమని, నటనాపరంగా నాని, సాయిపల్లవిలు పోటీ పడి నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక తాజాగా ఈ సాయిపల్లవి ఓ లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీకి కూడా ఓకే చెప్పిందట. ఈ వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్ అయింది. అంతలా తన హర్రర్, థ్రిల్లర్ సబ్జెక్ట్ ద్వారా ఏకంగా సాయిపల్లవిని మెప్పించిన ఆ దర్శకుడు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
ఇక ఈ చిత్రంలోని ట్విస్ట్‌లను చూసి ఆ పాత్ర ప్రేమలో భాన్సువాడ భానుమతి పడిపోయిందంటున్నారు. సినిమా మొత్తం సీరియస్ లుక్‌తో ఈ చిత్రంలో సాయిపల్లవి ఎంతో వినూత్నంగా ఉంటుందంటున్నారు. ఇక ఈ అమ్మడికి సౌత్‌తో ఉన్న క్రేజ్ చూసిన ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా తెరకెక్కించాలని ఓ కార్పొరేషన్ ఫిల్మ్‌ప్రొడక్షన్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.