Advertisement
Google Ads BL

మహేష్‌కి పాట అంటే నిజంగా అదృష్టవంతుడే!


ఏడాదికి పైగా షూటింగ్‌ జరుపుతున్నా కూడా 'స్పైడర్‌' షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినా కూడా కొన్ని ప్యాచ్‌వర్క్‌లతో పాటు కొత్తగా మరో పాటను రాయించి షూట్‌ చేయాలని భావిస్తున్నారట. దీని కోసం సంగీత దర్శకుడు హారీస్‌ జైరాజ్‌ ఓ ట్యూన్‌ని సైతం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 'బాహుబలి' చిత్రంలోని మొదటి పార్ట్‌లో చూపించి వినిపించే లిపి లేని ఓ కొండ జాతి భాషగా కాలకేయ ప్రభాకర్‌ పైన కిలికి భాష ప్రయోగం చేసిన రచయితగా మదన్‌కి మంచి పేరుంది. ఈ కిలికి భాషకు తెరరూపం ఇచ్చి ఆ భాషలో ప్రయోగం చేసినది మన తెలుగు రైటర్‌ కాదు. అతను తమిళ గేయ-సంబాషణల రచయిత మదన్‌ కర్కీ. 

Advertisement
CJ Advs

ఈయనకు తాజాగా తెలుగులో తన మొట్ట మొదటి పాటను అందునా మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌కి రాసే సువర్ణావకాశం దక్కించుకుని అదృష్ట వంతుల్లో నెంబర్‌వన్‌ స్ధానం పొందాడనే చెప్పవచ్చు. ఈ చిత్రం దర్శకుడు మురుగదాస్‌, సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌లు ఈ అవకాశం ఇవ్వడంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఆ పాట రాసే అవకాశం తనకు రావడాన్ని ఈ యువ రచయిత ఓపెన్‌గా ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. 

మురుగదాస్‌ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మహేష్‌బాబు అభిమానులు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ, అందరూ మెచ్చే విధంగా ఈ పాటను రాస్తానని ఆయన అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ పాటను యాడ్‌ చేయనుండటం మహేష్‌బాబు అభిమానులను ఎంతో ఆనందంలో ముంచేత్తే విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళభాషల్లో సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా రిలీజ్‌ చేయాలని ఆల్‌రెడీ డిసైడ్‌ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌9న మహేష్‌ని కోలీవుడ్‌కి పరిచయం చేసే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, ఆపై రెండు భాషల్లోనూ విడివిడిగా పాటల విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. 

Tamil lyricist Madhan Karky pens first Telugu song for 'Spyder':

Penned my first Telugu song for ‘Spyder'. Big thanks to director A.R Murugadoss and Harris Jayaraj for trusting in me, Karky tweeted.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs