Advertisement
Google Ads BL

'సవ్యసాచి' టైటిల్ లో చిన్న హింట్ వుంది!


నాగచైతన్య ప్రస్తుతం జోరుమీదున్నాడు. మంచి టాలెంట్‌ ఉన్నకొత్త కొత్తవారితో చిత్రాలు చేస్తున్నాడు. ఆ మద్య తన మొదటి చిత్రం 'కార్తికేయ' ద్వారా తానేంటో ప్రూవ్‌ చేసుకున్న చందూ మొండేటితో 'ప్రేమమ్‌' చిత్రం రీమేక్‌ చేశాడు.కానీ వాస్తవానికి అది చేయాల్సి వచ్చింది గానీ ఓ ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో చందు మొండేటి ఈ చిత్రం చేయాలని భావించాడు. అయినా కూడా మలయాళ 'ప్రేమమ్‌' చిత్రం ఫీల్‌ని మిస్సవ్వకుండా తనదైన శైలిలో రీమేక్‌ చేసి తన సత్తా చాటుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత తన తండ్రికి 'సోగ్గాడే చిన్ననాయన' వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన కళ్యాణ్‌కృష్ణతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం చేసి తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ కొట్టాడు. ఇక తన పెళ్లి అక్టోబర్‌ 6,7 వ తేదీలలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ లోపు తమిళ దర్శకుడు కృష్ణ మరిముత్తుతో 'యుద్దం శరణం' అనే డిఫరెంట్‌ ఫిల్మ్‌ చేస్తున్నాడు. ఇక వెంటనే ఆయన చందు మొండేటితో మరో చిత్రం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి 'సవ్యసాచి' అనే టైటిల్‌ని ప్రకటించినప్పటి నుంచి చిత్రంపై, టైటిల్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. అన్నిరకాల పనులను, దేనినైనా చేయగలిగిన వాడిని తెలుగులో సవ్యసాచి అంటారు. 

ఇక నటునిగా నాగచైతన్య అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ను నటునిగా సవ్యసాచి అనవచ్చు. మరి ఈ టైటిల్‌ తో తనని ఎలాంటి సబ్జెక్ట్‌తో 'సవ్యసాచి'గా జస్టిఫై చేయనున్నారనేది ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం ముందు చందుమొండేటి ఓ ఇంటర్వ్యూలో తనకు సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. దీంతో మొదటి చిత్రం 'కార్తికేయ'లో టచ్‌ చేసినట్టు ఈ తాజా చిత్రంలో కూడా చందు మొండేటి ఏదో విభిన్నమైన పాయింట్ నే టచ్‌ చేస్తున్నాడనే నమ్మకం కలుగుతోంది. 

నాగచైతన్యతో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ని తయారు చేసుకున్నాడా? అనే అనుమానం రావడానికి టైటిల్‌లోని 'సా' అక్షరంలో ఓ చేతి ముద్రను వేశాడు. ఈ చేతి ముద్రలోపల అప్పుడే పుట్టబోయే బిడ్డను చూపించాడు. సో.. ఈ చిత్రం ద్వారా ఏదో సస్పెన్స్‌ ఎలిమెంట్‌ను చైతూ- చందులు టచ్‌ చేసి తమ టైటిల్‌కి సార్థకత చేకూర్చి 'సవ్యసాచులు'లుగా నిరూపించుకుంటారని ఆశిద్దాం...! 

Small Hint in Savyasaachi Title :

Chandoo Mondeti and Naga Chaitanya Movie Title is Savyasaachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs